ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

praveen
గత ఏడాది లాగా ఆలస్యం జరుగకుండా బిసిసీఐ ఎంతో వ్యూహాత్మకంగా  వ్యవహరించి అనుకున్న సమయానికి ఐపీఎల్ ప్రారంభించింది. ఆటగాళ్లను బయో బబుల్  పద్ధతిలో ఉంచి కరోనా వైరస్ సమయంలో కూడా రిస్క్ చేసింది. కానీ ఎక్కడో తేడా వచ్చి ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లు  వైరస్ బారిన పడటంతో చివరికి ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో క్రికెట్ ప్రేక్షకులందరికీ నిరాశ ఎదురైంది. అయితే మిగిలిన ఐపీఎల్ ఎక్కడ నిర్వహిస్తారు ఎప్పుడు నిర్వహిస్తారు అని ఎంతో ఆశగా ఎదురు చూసారు క్రికెట్ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఇక 2021 ఐపీఎల్ సీజన్ లో మిగిలిన 31 మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బిసిసిఐ ప్లాన్ చేసింది



 అక్టోబర్ 15 నుంచి 27 రోజుల సమయంలో ఐపీఎల్ మిగిలి ఉన్న మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐని నిర్ణయించింది. కానీ బిసిసిఐకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. అక్టోబర్ 15న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని భావించినప్పటికీ.. ఇక దసరా వీకెండ్ స్టార్ట్ కాబోతుండటంతో.. దసరా రోజునే ఐపీఎల్ ఫైనల్ నిర్ణయించాలనుకుంటుంది బీసీసీఐ .కానీ బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయమే కొత్త చిక్కులు తెచ్చి పెట్టేలా కనిపిస్తుంది. అక్టోబర్ 18 నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.



 అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఏదైనా ఐసీసీ టోర్ని ఉంది అంటే ఆ టోర్నీకి 7 నుంచి 10 రోజుల ముందు వరకు ఎలాంటి టోర్ని ఉండకూడదు.. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల క్రికెట్ బోర్డులు నుంచి ఒప్పందం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఆడేందుకు తమ ఆటగాళ్ళను పంపే క్రికెట్ బోర్డులు.. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ దసరా సందర్భంగా నిర్వహించాలి అనే బీసీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: