పోలీస్ తో భార్య ఎఫైర్... భర్త ఏం చేసాడో తెలుసా?
అంతేకాకుండా అక్రమ సంబంధాలు ఎన్నో ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయి. ఎంతోమంది కట్టుకున్న వారు మోసం చేశారు అనే విషయాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటే.. మరి కొంతమంది ఏకంగా కట్టుకున్న వారిని సైతం దారుణంగా హత మారుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే తన భార్య తనను మోసం చేసి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అన్న విషయాన్ని తెలుసుకున్న భర్త ఎంతో కుంగిపోయాడు. చివరికి ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాధవ్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివాజీ అనే వ్యక్తికి వివాహం జరిగింది. ఈ క్రమంలో అతని భార్యకు నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ తో వివాహేతర సంబంధం ఉంది అన్న విషయం ఇటీవలే భర్తకు తెలిసిపోయింది. దీంతో ఇక తన భార్య మోసం చేసింది అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు భర్త శివాజీ. కొన్ని రోజుల పాటు ఇదే బాధతో కుంగిపోయిన శివాజీ ఇక బ్రతకడం వృధా అనుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరపగా.. శివాజీ ఆత్మహత్యకు భార్య అక్రమ సంబంధమే కారణమంటూ గ్రామస్తులు ఆరోపించారు.