అమెజాన్ లో మొబైల్ బుక్ చేస్తే.. ఏం వచ్చిందో తెలుసా?

praveen
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కావాలి అంటే ఆన్లైన్ వేదికగా ఆర్డర్ చేస్తున్నారు. ఇక అతి తక్కువ సమయంలోనే ఫాస్టెస్ట్ డెలివరీ దొరుకుతూ ఉండటంతో ఎక్కువ మంది లాక్ డౌన్ సమయంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఎంతో సేఫ్టీ గా ఉంటూ ఆన్లైన్లో తమకు కావలసిన వస్తువులను ఆర్డర్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ లాంటి ఆక్సిసిరీస్ ఆన్లైన్ వేదికగానే కొంటున్నారు.  కానీ కొన్ని కొన్ని సార్లు ఆన్లైన్ మోసాలు కారణంగా అందరూ అవాక్కవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

 ఆన్లైన్ లో విలువైన వస్తువు ఆర్డర్ చేసిన సమయంలో ఆర్డర్ చేసిన వస్తువు కు బదులుగా మరొక వస్తువు రావడం లాంటి ఘటనలు కూడా ఇప్పటివరకు జరిగాయి. ఇక ఇటీవల ఇక్కడ ఓ అమెజాన్ కస్టమర్ కి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది  ఖమ్మం లో నివాసముండే అచ్యుత్ కుమార్ అనే యువకుడు తన తల్లి పేరిట మొబైల్ ఫోన్ బుక్ చేసాడు. ఈ క్రమంలోనే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేక పోవడంతో కరీదు మొత్తాన్ని ప్లేముందే పే చేసాడు. ఇక డబ్బులు ముందే పంపించడంతో ఎంతో ఫాస్ట్ గా డెలివరీ కూడా అయింది.ఇక్కడ వరకు అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ వచ్చిన పార్సిల్ ఓపెన్ చేసి చూసిన తర్వాత మాత్రం ఆ యువకుడు షాక్ అయ్యాడు.

 పార్సిల్ మొత్తం ఓపెన్ చేసే సమయంలో ఒక వీడియో కూడా తీశాడు. అయితే ఇక పార్సిల్ మొత్తం ఓపెన్ చేయగానే అతను ఆర్డర్ చేసిన మొబైల్ కి బదులుగా అందులో రెండు సబ్బులు వచ్చాయి. దీంతో అచ్యుత్ కుమార్ కాస్త షాక్ అయ్యాడు  ఇక వెంటనే అమెజాన్ కాల్ సెంటర్ కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పి ఏకంగా అగ్గిమీద గుగ్గిలం మండిపడ్డాడు. అది ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో చివరికి అచ్యుత్ కుమార్ స్థిమిత పడ్డాడు. ఈ ఘటన కాస్త ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: