వివక్షకు బాధితులు అవుతున్న ఇండియన్ అమెరికన్లు.. షాకింగ్ రిపోర్ట్..?

Suma Kallamadi
భారతీయులు అమెరికా దేశానికి అత్యధిక సంఖ్యలో వలస వెళుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మన ఇండియన్స్ ఎక్కువగా అమెరికాలో నివసిస్తున్నారు. కాలక్రమేణా అమెరికాలో మన భారతీయుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఇద్దరు భారతీయులలో ఒకరు వివక్షకు, పొలిటికల్ పోలరైజేషన్ కి గురవుతున్నారని బుధవారం రోజు ఒక నివేదిక విస్తుపోయే నిజాలను వెల్లడించింది.

"సోషల్ రియాలిటీస్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ (భారతీయ అమెరికన్ల సామాజిక వాస్తవికతలు): 2020 ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే నుండి ఫలితాలు" పేరిట విడుదలైన ఒక రిపోర్టు.. ఆన్లైన్ వేదికగా 1200 మంది ఇండియన్ అమెరికన్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఫలితాలు వెల్లడించింది. ఈ ఆన్లైన్ సర్వే సెప్టెంబర్ 1, 2020 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరిగింది. ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే.. పరిశోధన, విశ్లేషణ సంస్థ అయిన యూగౌ(YouGov) భాగస్వామ్యంతో ఈ నివేదిక రెడీ చేసింది. అంతర్జాతీయ శాంతి కోసం పోరాడే కార్నెగీ ఎండోమెంట్, జాన్స్ హాప్కిన్స్- సాయిస్, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం సహకారంతో ఈ నివేదిక తయారు చేశారు.

"ఇద్దరు ఇండియన్ అమెరికన్ లలో ఒకరు తరచూ వివక్షకు గురవుతున్నారు. ఇద్దరు భారతీయ అమెరికన్లలో ఒకరు గత ఏడాదిలో తాము వివక్షకు గురయ్యామని వెల్లడించారు. వీరిలో ఎక్కువమంది వర్ణవివక్షకు గురయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అమెరికాలో పుట్టి పెరిగిన ఇండియన్ అమెరికన్లు మాత్రమే వర్ణవివక్షకు గురవుతున్నారు తప్పించి నల్లగా ఉన్న ఇతర దేశస్తులు ఎవరూ కూడా వర్ణవివక్షకు గురవడం లేదు" అని తాజా నివేదిక పేర్కొంది.

ఇకపోతే ఇండియన్ అమెరికన్లు తమ వర్గానికి చెందిన వారినే ఎక్కువగా పెళ్లి చేసుకుంటున్నారు అని తేలింది. ఈ నివేదిక ప్రకారం.. పది మందిలో 8మంది భారత సంతతికి చెందిన వ్యక్తులనే పెళ్లి చేసుకుంటున్నారు. భారతీయ మూలాలు ఉండి అమెరికా దేశంలో పుట్టిన వ్యక్తులను ఎక్కువగా వివాహం చేసుకుంటున్నారు. ఇక భారతీయ అమెరికన్లకు మత పట్టింపులు కూడా ఎక్కువగా ఉన్నాయని నివేదికలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: