రోబోల వాడకం బయటి దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో చాలా పనులకు రోబోలనే వాడుతున్నారు. ఇక ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు ఉన్న సోఫియా రోబో అందరికీఈ గుర్తుండే ఉంటుంది. దాదాపు ప్రపంచంలోనే తొలి అధికారిక గుర్తింపు కలిగిన హ్యూమనాయిడ్ రోబోగా సోషియాకు పేరుంది.
ఆ రోబోను తయారు చేసిన కంపెనీనే ఇప్పుడు మరో సంచలనానికి నాంది పలికింది. ఇప్పుడు మనిషిలాగే ఉన్న మరో రోబోను తయారుచేసింది ఆ కంపెనీ. దాని పేరు గ్రేస్ అని పెట్టింది ఆ సదరు కంపెనీ. ఇప్పుడున్న కరోనా కష్టకాలంలో పేషెంట్లకు సేవలందించేందుకు దీనిని తయారు చేసింది. హంకాంగ్‌కు చెందినటువంటి హన్సన్ రోబోటిక్స్ టెక్ సైంటిస్టుల టీం ఈ తరహా రోబోను కనిపెట్టింది.
అయితే గ్రేస్ కు చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయని చెబుతోంది కంపెనీ. కరోనా వచ్చి ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లకు ఈ గ్రేస్ రోబో సేవలందిస్తోంది. అంతే కాదు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో ఈ రోబో పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. దీనికి చెస్ట్‌లో ఒక థెర్మల్ కెమెరా ఉండటంతో ఎదుటి వారి టెంపరేచర్‌ను స్కాన్ చేసి వాళ్లు కొవిడ్ లక్షణాలతో ఉన్నారో లేదో గుర్తిస్తుంది.
హాంకాంగ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్‌లో ఈ గ్రేస్ చేస్తున్న పనిని చాలాబాగా పరిశీలించారు. దీని శక్తి, సామర్థ్యాలు పరిశీలించిన తర్వాతే దీని వాడకాఇనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గవర్నమెంట్. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు డేవిడ్ హన్సన్ స్పష్టం చేశాడు. మనిషి పోలికలతో ఉండే ఈ రోబోలను ఇంకా తయారు చేస్తామన్నారు. ఇవి ఐసోలేషన్‌లో ఉన్న వారికి కనెక్ట్ అయ్యేందుకు సరైనవేనని తేల్చి చెప్పారు. అంతే కాదు ఈ రోబో ఏకంగా ఇంగ్లీష్‌తో పాటు మాండరిన్, కాంటోనీస్ భాషల్ని అవలీలగా మాట్లాడగలుగుతుందని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధులు. అయితే ఈ గ్రేస్ రోబోను ధరను ఇంకా ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది.