వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత నారాలోకేష్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ...ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇంట్లో ఉన్న లోకేష్ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నవా అంటూ మండి పడ్డారు. తాత ముఖ్యమంత్రి బాబు ముఖ్యమంత్రి అని చెప్పుకున్న నీకు డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు. అమరావతి ప్రజలు నిన్ను చీ కొట్టి పంపించారని అన్నారు. జగన్ ను తిడితే టీవీలో వేస్తారని శునకానందం తప్ప ఏమీలేదని అనిల్ అన్నారు. చంద్రబాబు ముదురు కాబట్టి ఈ రాష్ట్రంలో టైమ్ అయిపోయిందని ముందే గ్రహించారని వ్యాఖ్యానించారు.
అందుకే హైదరాబాద్ లో ఇళ్లు కట్టుకున్నారని అన్నారు. తెలంగాణలో పార్టీ ఎత్తేశారని 2014లో ఇక్కడ కూడా ఎత్తేస్తారని వ్యాఖ్యానించారు. జగన్ పాడి రైతులు భాగుండాలని మంచి చేయాలని చూస్తే నువ్వు హెరిటేజ్ సంస్థను అడ్డుపెట్టుకుని అనేక మందిని ఇబ్బంది పెట్టావని లోకేష్ ను ఉద్దేశించి అన్నారు. నీకు పప్పు అనే టాగ్ ప్రజలు ఇచ్చారని...అది మేం అనలేదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ చేసే అభివృద్ధిలో టీడీపీ పార్టీ కొట్టుకుపోయేలా ఉందని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి అమూల్ బేబీ అయితే నువ్వు దున్నపోతా...? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డం పెంచి జూమ్ లోకి వస్తే మాస్ లీడర్ అవుతారా..అవ్వరు అది బ్లడ్ లో ఉండాలని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం ఏదైతో చేశారో అదే ఇప్పుడు జగన్ చేస్తున్నారు. వైఎస్ఆర్ నుండి ఆ తెగింపు వైఎస్ జగన్ కు వచ్చింది అన్నారు. 22 ఖరీఫ్ కల్లా పోలవరం నుండి నీళ్ళు ఇస్తామని అన్నారు. కోవిడ్ ఉన్నా అంతా కలిసి ప్రాజెక్టు కోసం పనులు చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్న మా మీద బట్ట కాల్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. .