ఆడపిల్లలకు మొబైల్స్ ఇవ్వడం వల్లే అత్యాచారాలు?

praveen
ఈ మధ్య కాలంలో దేశంలో ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.  ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో కళ్ళు మూసుకుపోయి మానవ మృగాలుగా మారుతు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా అత్యంత పాశవికంగా హత్య లకు సైతం పాల్పడుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.  రోజు రోజుకి తెర మీదకి వస్తున్న ఘటనలు ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది అనే విషయాన్ని అడుగడుగున గుర్తు చేస్తూనే ఉన్నాయి.  నాగరిక సమాజంలో కూడా అనాగరిక ఘటనలు చూస్తుంటే ఈ లోకంలో ఆడపిల్లగా పుట్టడమే శాపమా అని ఎంతోమంది ఆడపిల్లల బాధ పడే పరిస్థితి వస్తుంది.



 అయితే ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగిన సమయంలో లేదా లైంగిక వేధింపులు జరిగిన సమయంలో మహిళా సంఘాలు ఆడపిల్లలకు అండగా నిలుస్తూ ఉంటాయి. అంతేకాదు ఆడపిల్లలకు న్యాయం జరిగి ఇక నిందితులకు శిక్ష పడేంత వరకు మహిళా సంఘాలు పోరాటం కూడా చేస్తూ ఉంటాయి.  కొన్ని కొన్ని సార్లు ఇలా మహిళా సంఘాలు పోరాటంతో ఎంతోమంది ఆడపిల్లలపై అత్యాచారాలు చేసిన వారికి.. వేధింపులకు దిగిన వారికి శిక్షలు పడిన ఘటనలో కూడా ఉన్నాయి.  ఇలా మహిళా సంఘాలు అడుగడుగున ఆడ పిల్లల కోసమే పని చేస్తూ ఉంటాయి. ఆడపిల్లల గురించి ఎవరైనా చులకనగా మాట్లాడినా కూడా మహిళా సంఘాలు భగ్గుమంటాయి.



 కానీ ఇక్కడ ఒక మహిళా కమిషన్ సభ్యురాలు చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయాయ్. అంతేకాకుండా ఎంతో వివాదాస్పదంగా మారిపోయాయి ఆ మహిళా కమిషన్ సభ్యురాలు వ్యాఖ్యలు.  యూపీ కి చెందిన మహిళా కమిషన్ సభ్యురాలు మీనాకుమారి ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలకు మొబైల్స్ ఇస్తే అవి అత్యాచారాలకు దారితీస్తున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అలీగడ్ లో మహిళల ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలకు ఫోన్ లు ఇస్తే గంటలతరబడి అబ్బాయిలతో మాట్లాడతారని.. ఆ తర్వాత  వారితోనే పారిపోతారని..  అమ్మాయిల తల్లిదండ్రులకు ఈ విషయం అస్సలు తెలియదు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: