వావివరసలు మరిచిన అన్న.. చెల్లి ఏం చేసిందో తెలుసా?

praveen
మద్యం మత్తు ఎంతో మంది జీవితాలను దుర్భరం చేసింది.  మద్యం మత్తు కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కూడా వచ్చింది.  ఇక మద్యం మత్తులో తూగుతున్న జనాలు తాము మానవత్వం ఉన్న మనుషులం అనే విషయాన్ని మరిచి ఏకంగా క్రూరమృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రోజురోజుకు ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వచ్చి సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక యువకుడు ఇటీవలే మద్యానికి బానిస గా మారిపోయాడు.


 తరచూ ఫుల్లుగా తాగి వచ్చి ఇక ఇంట్లో వాళ్లతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇక అసభ్యకరంగా తిడుతూ వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. ఇక ఇటీవలే మరో సారి ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన సదరు యువకుడు ఇంట్లో మరోసారి గొడవ చేశాడు  ఈ క్రమంలోనే  ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్న చెల్లిని అసభ్యంగా తిట్టడమే కాదు వావి వరసలు మరిచి దారుణంగా   ప్రదర్శించడం మొదలుపెట్టాడు.  ఇక మద్యం మత్తులో ఉన్న అన్నను కొద్ది సేపటి వరకూ వారించేందుకు ప్రయత్నించిన సదరు యువతి చివరికి సహనం కోల్పోయింది. దీంతో ఇంట్లో ఉన్న రోకలిబండతో అన్న తలపై గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.



 ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది  విద్యానగర్కు చెందిన సతీష్ మద్యానికి బానిస అయిపోయాడు. కుటుంబ బాధ్యతలను వదిలేసి ఆవరాగా తిరుగుతూ ఉండేవాడు. ఇక తరచు మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగి అసభ్యంగా తిరుగుతూ ఉండేవాడు. ఇక ఇటీవల రాత్రి సమయంలో మరోసారి మద్యం తాగి వచ్చిన సతీష్  ఇంట్లో పడుకుని ఉన్న చెల్లి తో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే  వావి వరసలు మరిచి మృగంలా ప్రవర్తిస్తున్న అన్న నుండి తప్పించుకునేందుకు  యువతి ఎంత ప్రయత్నించినప్పటికీ వదలలేదు. చివరికి సహనం కోల్పోయిన యువతి ఇంట్లో ఉన్న రోకలిబండతో అన్న తలపై మోదింది  దీంతో సతీష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: