సెంచరీ కొట్టిన డీజిల్ ధర?

praveen
పెట్రోల్ ధరలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. ఇప్పటికీ కరోనా సంక్షోభం కారణం గా సామాన్యుడికి కనీస ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడింది.  ఇలాంటి నేపథ్యంలోనే అటు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు.  బ్రతకడమే కష్టం గా ఉన్నరోజుల్లో నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు సామాన్య ప్రజలు. అదే సమయంలో అటు పెట్రోల్ ధరలు కూడా రోజురోజుకీ భగ్గుమంటున్నాయి.  దీంతో వాహనం బయటికి తీయాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

 దేశంలో రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తీరు సామాన్య ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మొన్నటి వరకు సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలు ఇక ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో కాస్త తగ్గుముఖం పట్టాయి.  అయితే ఇక ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదు అప్పుడే మళ్లీ పెట్రోల్ ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడికి ఎంతో భారంగా మారిపోతున్నాయి. ఇక అత్యవసరమైతే తప్ప వాహనాన్ని బయటకు తీయడం లేదు వాహనదారులు.


 అయితే మొన్నటి వరకు పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాడం  చూశాం ఇక ఇప్పుడు డీజిల్ ధరలు కూడా సెంచరీ కొట్టింది. ఇటీవలే రాజస్థాన్ లో డీజిల్ ధర ఏకంగా సెంచరీ కొట్టడం సంచలనంగా మారింది. పెట్రోల్ డీజిల్ పై అత్యధిక వ్యాట్ రాజస్థాన్లోని ఉంటుంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లా లో లీటర్ పెట్రోల్ ధర 107.22  రూపాయలకు ఉండగా.. అటు డీజిల్ ధర 100.2 రూపాయలకు చేరింది. రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో వ్యాట్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజులు ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే హైదరాబాద్ లో పెట్రోల్ ధర కూడా సెంచరీ కొట్టడం ఖాయం అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: