ఆ దేశ అధ్య‌క్షుడికి భారీ జ‌రిమానా.. ఎందుకంటే.. ?

Suma Kallamadi
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రజలు మాస్కులు వాడటం, శానిటైజర్లు వినియోగించడం ద్వారా సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ప్రభుత్వాలు వివిధ ఆంక్షలు పెట్టినప్పటికీ చాలా మంది వాటిని పాటించడం లేదు. అందుకే ప్రభుత్వాలు వారిపై కొరడా ఝులిపిస్తున్నాయి. మాస్కులు లేకుండా బయట తిరిగిన వారికి భారీ జరిమానాలు విధిస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. మనదేశంలో ఇలాంటివి జరగడం వల్లే చాలా మంది ఇల్ల నుంచి బయటకు రావాలంటే మాస్కులు తప్పకుండా పెట్టుకుని వస్తున్నారు. ఈ భయం ఉండటం వల్లే అందరూ కరోనా రాకుండా పోరాటం చేస్తున్నారు. కరోనా అంతానికి సన్నద్దమవుతున్నారు. అయితే కొన్ని దేశాలు  మాత్రం ఇంకా పాత అలవాట్లను మార్చుకోవడం లేదు. ఇంకా మాస్కులు పెట్టుకోకుండా బయటే తిరుగుతున్నారు. శానిటైజర్లను వినియోగించడం లేదు. తాజాగా బ్రెజిల్ లో ఆ దేశాధ్యక్షుడే కరోనా రూల్స్ ను బ్రేక్ చేశాడు.
బ్రెజిల్ దేశ అధ్యక్షుడు అయిన జైర్ బొల్సనారో కరోనా నియమాలు పాటించలేదు. సావొో పాలోలో బైక్ ర్యాలీ నిర్వహించనుండగా ఆ ర్యాలీకి అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. అయితే ఆయన ఆ సమయంలో మాస్కు పెట్టుకోకుండా ర్యాలీకి వచ్చాడు. దీంతో ఆ ర్యాలీకి వచ్చిన వారంతా మాస్కులు ధరించకుండా ఊరుకున్నారు. ఆ సమయంలో అధ్యక్షుడు కూడా వారిని ఏమీ వాదించలేదు. పైగా వారిని ఎంకరేజ్ చేశాడు. రాబోవు ఎన్నికల్లో ఈయన పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ ర్యాలీకి హాజరయ్యారు. అయితే దీనిని గమనించిన ఆ రాష్ట్ర గవర్నర్ జో డోరియా అధ్యక్షుడికి జరిమానా విధించాడు. వాస్తవంగా ఆ ప్రాంతంలో మాస్కు ధరించకపోతే కఠిన నిబంధన పాటించకపోతే జరిమానా కచ్చితంగా విధిస్తారు. దీంతో ఆ గవర్నర్ దేశాధ్యక్షుడిపైనే జరిమానా విధించారు. డోరియా అధికారులు  అధ్యక్షుడికి 100 డాలర్ల జరిమానాను విధించారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: