హ‌మ్మ‌య్య‌..కరోనా త‌గ్గుముకం.. !

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ సృష్టించిన క‌ల్లోలం అంతా ఇంతా కాదు. ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో కేసుల సంఖ్య మ‌రియు మ‌ర‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండేది. అంతే కాకుండా స‌మయానికి లాక్ డౌన్ విధించ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. అయితే ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో క‌రోనా పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వాలు మ‌రియు ప్ర‌జ‌లు లైట్ తీసుకున్నారు. క‌రోనా జ్వ‌రం లాంటిది మాత్ర‌మేన‌ని భావించారు. మాస్క్ లు పెట్టుకోవ‌డం మరిచారు...సామాజిక దూరాన్ని గాలికి వ‌దిలేశారు. కానీ అదే మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్ రూపంలో వ‌చ్చి క‌ల్లోలం సృష్టించింది. ఒక్క‌సారిగా దేశాన్ని స్మ‌శానం లా మార్చేసింది. రోజుకు ల‌క్ష‌ల్లో కేసులు వేల‌ల్లో మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 

అయితే తాజాగా క‌రోనా విష‌యంలో హ‌మ్మ‌య్య అనిపించే న్యూస్ వ‌చ్చేసింది. దేశంలో క‌రోనా కేసులు మ‌రియు మ‌ర‌ణాలు త‌గ్గ‌ముఖం ప‌డుతున్న‌ట్టు కేంద్ర మంత్రిత్వశాఖ ప్ర‌క‌టించింది. తాజాగా దేశంలో పదిలక్షల దిగువకు యాక్టీవ్ కేసులు చేరిన‌ట్టు ప్ర‌క‌టించింది. వారం రోజులుగా లక్షకు త‌క్కువ‌గా కరోనా కొత్త కేసులు కేసులు న‌మోద‌వుతున్న‌ట్టు తెలిపింది. కొత్తగా దేశంలో 70,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా 3921మంది మృతి చెందారు. మార్చి 31 తరువాత దేశ‌లో అతి తక్కువగా కొత్త కేసుల నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,95,10,410 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం 3,74,305 మంది  మృతి చెందారు.

అంతే కాకుండా ప్రస్తుతం దేశంలో 9,73,158 యాక్టివ్ కేసులు ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కూ 2,81,62,94 మంది డిశ్చార్జ్ అయ్యారు.  అంతే కాకుండా దేశంలో ప్ర‌స్తుతం 4.25 శాతంగా పాజిటివిటి రేటు ఉంది. 21 రోజులుగా 10 శాతానికి దిగువన పాజిటివిటి రేటు నమోదయ్యింది. మ‌రోవైపు 32 రోజులుగా కొత్త కేసులకన్నా రికవరీ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క‌రోనా కేసులు త‌గ్గ‌ముకం ప‌ట్టాయి. నాలుగు రాష్ట్రాల్లో లక్షకు పైగా యక్టీవ్ కేసులున్నాయి. ప్ర‌స్తుతం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో అధికంగా యక్టీవ్ కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: