ఆంధ్రాలో లిప్ స్టిక్ తయారీ.. జగన్ దృష్టి పెడితే విప్లవమే?

praveen
సాధారణంగా ఆడపిల్లలంటే అందంగా ఉంటారు.. ఇక వారి అందాన్ని మరింత పెంచుకోవడానికి ఇటీవలికాలంలో ఇక మేకప్ లు లాంటివి వేస్తున్నారు. కొంతమంది మేకప్ లాంటి వాటికి దూరంగా ఉన్నా.. కనీసం లిప్స్టిక్ పెట్టుకుంటారు. ఇక ఇలా లిప్స్టిక్ పెట్టుకోవడం వల్ల తమ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు మహిళలు. మహిళలకు నచ్చే విధంగా ఎన్నో రకాల లిప్ స్టిక్ లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాళ్లకు నచ్చిన కలర్ ఫ్లేవర్ ను ఎంచుకుని మహిళలు వాడుతుంటారు.

 తమ పెదాలు ఎలా ఉన్నప్పటికీ లిప్ స్టిక్ తో ఎంతో అందంగా మార్చుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిప్స్టిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఇంతకీ ఇప్పుడు లిప్స్టిక్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటారా.. అయితే స్టోరీ లోకి వెళ్దాం.. లిప్స్టిక్ తయారీకి వాడే గింజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంపిస్తున్నట్లు  ఇటీవల వెలుగులోకి వచ్చింది.  తూర్పుగోదావరి జిల్లాలో కిషోర్ అనే యువకుడు ఉన్నాడు. ఎంబీఏ పూర్తి చేసినప్పటికి అతనికి వ్యవసాయం పై మక్కువ. ఈ క్రమంలోనే ఆధునిక వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అనాటో మొక్క గురించి తెలుసుకున్నారు.


 నాచురల్ గా కలర్  ఉన్నటువంటి ఈ మొక్క గింజలను అటు లిఫ్టిక్ తయారీలో ఉపయోగిస్తారట. అంతర్జాతీయ మార్కెట్లో ఇక వీటికి ఎక్కువగా డిమాండ్ ఉందట.. దీంతో ఇక ఈ పంట పండించడం మొదలు పెట్టాడు.  అంతేకాదు ఇక తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన సైతం ఈ పంటను పండిస్తున్నట్లు కిషోర్ గుర్తించాడు.. ఇక మొదట అంతగా డబ్బులు రాకపోయినప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఆకర్షణీయమైన ఆదాయాన్ని పొందుతున్నారట అందరూ. ఇక రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానం చేసి ఈ పంటలకు ప్రోత్సాహకం ఇస్తే ఇక ఇది ఒక విప్లవంగా మారిపోతుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: