బీజేపీకి బాబు బంపర్ ఆఫర్... ?

Satya
బీజేపీ కోరుకున్నది ఏపీలో జరగకపోవచ్చు కానీ గతం కంటే కూడా మహా వైభోగమే పట్టే అవకాశం అయితే ఉంది. ఏపీలో బీజేపీది ప్రస్తుతం విలక్షణమైన విపక్ష పాత్ర. అసెంబ్లీలో ఒక్క సభ్యుడు లేడు. మండలిలో ఒకే ఒక మెంబర్ ఉన్నాడు. ఇక టీడీపీ నుంచి ఫిరాయించి వచ్చిన ముగ్గురు రాజ్య సభ సభ్యులు ఉన్నారు. యూపీ కోటాలో నియమితుడైన జీవీఎల్ నరసింహారావు మరో ఎంపీ. ఇది మాత్రమే బీజేపీకి బలం.
అటువంటి బీజేపీకి రాజకీయంగా మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి అంటే దానికి కారణం కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలో ఉండడం. ఎన్ని సమీకరణలు తారు మారు అయినా బీజేపీ మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అని ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికీ నమ్ముతున్నాయి. గతసారి తప్పుడు అంచనాలు వేసుకున్న చంద్రబాబు ఈసారి మాత్రం జాతీయ స్థాయిలో విపక్షాల వైపు అసలు మొగ్గడంలేదు.
మళ్లీ మోడీయే రావడం ఖాయమన్న అంచనాతోనే ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనడంలేదు అంటారు. అంతే కాదు 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు కూడా బాబు అన్ని ద్వారాలు తెరచి రెడీగా ఉన్నారని అంటున్నారు. బీజేపీ జనసేనలతో పొత్తు పెట్టుకుని 2024 లో ఏపీలో జగన్ని ఎదుర్కోవాలన్నది బాబు ఎత్తుగడ. అందుకు గానూ ఈసారి భారీ ఎత్తున సీట్లను కూడా ఆ పార్టీలకు కేటాయించడానికి బాబు సిద్ధంగా ఉన్నారట. ఏపీలో 175 సీట్లు ఉంటే అందులో వంద టీడీపీకి ఉంచుకుని 75 సీట్ల దాకా మిత్రులకు ఇచ్చేందుకు బాబు ఓకే అని అంటున్నారు. ఈ ప్రచారం కనుక నిజం అయితే ఏపీలో బీజేపీకి ఇంతకంటే బంపర్ ఆఫర్ వేరొకటి ఉండదు.
1999, 2004, 2014లలో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది కానీ ఎపుడూ డజన్ సీట్లకు మించి టీడీపీ విదల్చలేదు. కానీ ఈసారి కేవలం విభజన ఏపీలోనే ఇన్ని సీట్లు అంటే కమలం పార్టీ టెప్ట్  అవడం ఖాయమే అంటున్నారు. అయితే పొత్తులకు  ఇపుడు నో అంటున్న బీజేపీ ఎన్నికలు దగ్గపడుతున్న వేళ ఒకే చెబుతుంది అన్న నమ్మకంతో టీడీపీ ఉందిట. మంచి ఆఫర్ కాబట్టి ఎస్ అన్నా ఆశ్చర్యం లేదు అన్నదే రాజకీయ విశ్లేషకుల మాట. మొత్తానికి బాబు బంపర్ ఆఫర్ తో బీజేపీని బుట్టలో పడేస్తారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: