ఆ ఇద్దరూ అంటే రాహుల్ కి ఎందుకంత నమ్మకం...?

వాస్తవంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది కూడా అర్థంకాని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ లో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నా సరే ఎవరి ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటి అనేది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. దాదాపు 30 ఏళ్ల పాటు సోనియాగాంధీ సీనియర్ నాయకులతో కలిసి పనిచేసిన ప్రభుత్వాలు ముందుకు నడిపించిన సరే ఇప్పుడు వాళ్లు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏంటి అనేది ఆమె కూడా చెప్పలేకపోతున్నారు. ప్రధానంగా సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో భయం అనేది లేకుండా పోయింది అనే భావన కూడా చాలావరకు వ్యక్తమవుతోంది.
ఇక కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ నమ్మే నాయకులు కొంత మంది ఉన్నారని అందులో ప్రధానంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అదేవిధంగా కేసీ వేణుగోపాల్ వంటి వారిని రాహుల్ గాంధీ  ఎక్కువగా నమ్ముతూ ఉంటారని కాంగ్రెస్ పార్టీలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నీళ్ళతో ఎక్కువగా రాహుల్ గాంధీ చర్చలు జరుపుతూ ఉంటారు అని, డీకే శివకుమార్ విషయంలో రాహుల్ గాంధీకి నమ్మకం ఎక్కువగా ఉంటుందని అందుకే రాహుల్ గాంధీ ఆయనకు ప్రభుత్వాలను కాపాడే బాధ్యత కూడా ఒకానొక సందర్భంలో అప్పగించారని చెప్తూ ఉంటారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ లో అగ్రనేత గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణంతోపాటు గా ప్రతినాయకుడి తో కూడా ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా అశోక్ గెహ్లాట్ చాలా కీలకంగా వ్యవహరించారు... అదే విధంగా కమలనాథ్ తో పాటు మరి కొంతమంది సీనియర్ నాయకులతో కూడా రాహుల్ గాంధీకి మంచి సంబంధాలే ఉన్నాయి. సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింధియా కూడా ఒకప్పుడు రాహుల్ గాంధీ నమ్మకం గా ఉండే వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: