కేసీఆర్‌కు భయపడుతోన్న వైసీపీ మంత్రులు.. ఆ కథ ఇదా ?
కేసీఆర్ అధికారిక పత్రిక అయిన నమస్తే తెలంగాణలో జగన్ తీరును తూర్పారపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయమై తెలంగాణ ముఖ్యమంత్రిని నిలదీసే క్రమంలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల నోళ్లు ఎందుకు పెగలడం లేదు.. ఇప్పుడీ చర్చ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన, జూరాల ప్రాజెక్టు దిగువన ఓ ఆనకట్ట నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 55 టీఎంసీలు. ఇన్ని టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం చేస్తోన్న పనే అన్నది తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ.
ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్.. రాయలసీమ లిఫ్ట్ ద్వారా కృష్ణా నది నుంచి నీటిని దొంగలిస్తున్నందున.. దానికి ప్రతిచర్యగానే తాము ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. 55 టీఎంసీలతో శ్రీశైలం ఎగువన ప్రాజెక్టు కడితే అసలే అంతంత మాత్రంగా ఉన్న కృష్ణా జలాల విషయంలో ఇప్పుడు తెలంగాణలో ఈ ప్రాజెక్టు కూడా కడితే దిగువకు అస్సలు నీళ్లు రావు. ఇది ఏపీ ప్రయోజనాలకు పెద్ద నష్టం కలిగించేదే. కానీ దీని విషయంలో ఇక్కడ వైసీపీ వాళ్లు ఎందుకు నోరు మొదపడం లేదు.
దీనికి టీడీపీ నేతలు, సాధారణ ప్రజల్లో జరుగుతోన్న చర్చ ఏంటంటే హైదరాబాద్‌లో వీళ్ల వ్యాపారాలు సక్రమంగా సాగాలన్నా.. వీరి ఆస్తులు సేఫ్ గా ఉండాలన్నా కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనకూడదు. ఏపీ ప్రయోజనాలు ఏమైపోతే మాకేంటి ? మేం , మా ఆస్తులు సేఫ్ గా ఉంటే చాలన్నదే వీరికి ముఖ్యం కదా ?