బాబోయ్.. సాల్ట్ వేసి సెలబ్రిటీ అయిపోయాడు..?
అయితే అతను చేసే వంటలో ఏది ఫేవరెట్ అని అంటారా.. వంటల గురించి అయితే తెలియదు.. కానీ వంట పూర్తిగా అయిపోయిన తర్వాత అతను చేతితో ఉప్పు వేసే స్టైల్ మాత్రం ఎంతో ఫేమస్. ఆ స్టైల్ కే అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇక అతను చేసిన వంట తినడానికి ఎంతో మంది అతను పనిచేసే రెస్టారెంట్ కు సైతం వెళ్తున్నారు. అంతేకాదు పూర్తిగా వండిన తర్వాత అతను సాల్ట్ వేసి స్టైల్ ఎంతో ఫేమస్ కూడా అయిపోయింది. అందుకే ఏకంగా అతనికి సాల్ట్ బి అనే పేరు కూడా వచ్చింది.
అతను బీఫ్ మాంసాన్ని ఎంతో బాగా వండుతాడట. అందుకే అతని బీఫ్ స్పెషలిస్ట్ అని కూడా అంటారు అక్కడ వాళ్ళు. ఇక ఇతను వండిన వంట తినడానికి అక్కడున్న ఎంతో మంది ప్రముఖులు సైతం పోటీ పడుతూ ఉంటారు. కాగా గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఇతనికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఇతను చేస్తున్న వంటకాలను ఇతడు వంటలపై స్టైల్గా సాల్ట్ వేసి విధానం చూసి చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.