కాషాయానికి కొందరు ఎరుపు కి ఇంకొందరు..పీపుల్ స్టార్ పై గోగినేని ఫైర్.. !

బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రముఖ హేతువాది బాబు గోగినేని ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తుంటారు. హేతువాది కావడంవల్ల బాబు గోగినేని మూఢనమ్మకాలపై ఇతర అంశాలపై టీవీలో చర్చలు పెడుతుంటారు. ఈ చ‌ర్చ‌ల్లో సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారుతారు. అయితే  కొద్ది రోజుల నుంచి బాబు గోగినేని ఆనందయ్య మందుపైనే ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆనందయ్య‌ మందును పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సైతం తీసుకుంటున్నారు. అంతేకాకుండా చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. హైకోర్టు సైతం ఆనంద‌య్య మందుకు అనుమతినిచ్చింది. 

కానీ గోగినేని మాత్రం ఆనందయ్య ఇచ్చేది మందు కాద‌ని చ‌ట్నీ అని సంచలన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దాంతో బాబు గారిని కొంతమంది వ్యతిరేకించగా మరికొంతమంది సమర్థించారు. ఇదిలా ఉండగా గతంలో పీపుల్ స్టార్ మాట్లాడిన మాటల పై గోగినేని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్బుక్ వేదికగా పీపుల్ స్టార్ పై గోగినేని కామెంట్స్ చేశారు. కాషాయానికి కొందరుంటే ఎరుపు కి ఇంకొందరు అంటూ హెడ్డింగ్ పెట్టి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆర్ నారాయణ మూర్తి గతంలో చేసిన కామెంట్లు ఏమిటంటే.... గ‌త సంవ‌త్స‌రం మార్చ్ లో విజ‌య‌వాడ‌లో కార్టూన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి నారాయ‌ణ మూర్తి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న కరోనా గురించి మాట్లాడుతూ... కేవలం ప్రజల్లో భయాన్ని సృష్టించి సొమ్ము చేసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు నాట‌కాలు ఆడుతున్నాయ‌ని అన్నారు. మాస్క్ లు, శానిటైజ‌ర్లు, ఇత‌ర మెడిక‌ల్  వస్తువులు అమ్ముకోవడానికి క‌రోనాను మరింత ప్రమాదకరంగా చూపిస్తున్నాయ‌ని తెలిపారు. ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ సంస్థలకు మేలుచేకూర్చే విధంగా ఉన్నాయంటూ నారాయణమూర్తి ఫైర్ అయ్యారు.

కాగా ఇప్పుడు గోగినేని నారాయ‌ణ మూర్తి కాంమెంట్ల‌ను గుర్తు చేస్తూ...ఈయ‌న మాట్లాడిన త‌ర‌వాత‌ రెండు నెలల్లో ఎన్ని లక్షల మంది చనిపోయారంటూ ప్రశ్నించారు. మంచి వారు అందరూ తెలివైన వారని గ్యారెంటీ లేదన్నారు. సైన్స్ తెలుసుకోవాలన్నారు. లేకపోతే సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసుకోవాలన్నారు. పబ్లిక్ గా మాట్లాడి ఏది సత్యం కాదు అంటే జరిగేది నిలువుదోపిడి అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: