వాహనదారులకు భారీ షాక్.. 14 రూ.లు పెరగనున్న పెట్రోల్ ధర?
ఇక మరికొన్ని ఈ రోజుల్లో డీజిల్ కూడా సెంచరి కొడుతుందేమో అన్నట్లుగా ఉంది పరిస్థితి అయితే పెట్రోల్ ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా సామాన్య ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం తప్ప తగ్గే ఛాన్స్ మాత్రం లేదు అంటున్నారు నిపుణులు. ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 75 డాలర్లకు చేరింది. అదే సమయంలో అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై విధిస్తున్న పనులు తగ్గించే ఆలోచనలు అస్సలు లేవు. ఇక రానున్న కాలంలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 100 డాలర్లకు చేరవచ్చని అంచనాలు కూడా వేస్తున్నారు నిపుణులు.
అంటే ఇక నిపుణుల అంచనాల ప్రకారం క్రూడ్ ఆయిల్ ధర 25 పెరగనుందట. ఇదే జరిగితే.. ఇక దేశంలో ఇప్పటికే మండిపోతున్న పెట్రోలు ధరలు 12 నుంచి 15 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు. ఇక నిపుణుల అంచనా లతో సామాన్యుల వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పటికే సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో పెట్రోల్ ధర పెరుగుతుందని అది కూడా 12 రూపాయలకు పైగా పెరిగిపోతుందని అంచనాలు వస్తుండడంతో ఇక వాహనం తియ్యాలా వద్ద అని ఇప్పటినుంచి ఆలోచనలో పడి పోతున్నారు సామాన్య ప్రజలు.