సుప్రీంకోర్టు ఆదేశం.. అఫడవిట్ సిద్ధం చేసిన జగన్?
అయితే పరీక్షల నిర్వహణకు పోవడానికి గల కారణాలు చెబుతూనే.. పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా అఫిడవిట్ లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎంతో వేగం గా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యం లో పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నాం అంటూ అఫిడవిట్లో తెలిపింది. పదవ తరగతిలో మార్కులు కాకుండా గ్రేడ్లు ఇచ్చిన నేపథ్యం లో ఇక ఇప్పుడు మార్కులు లెక్కించడం సరి కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే స్కూల్స్ అంతర్గతం గా ఇచ్చిన మార్కులపై బోర్డులకు ఎలాంటి నియంత్రణ ఉండవూ అంటూ ఏపీ ప్రభుత్వం తెలిపింది. అందువల్ల కచ్చితమైన మార్కులు ఇవ్వడం సాధ్యం కాదంటూ తెలిపింది. ఇక ఇంటర్ పరీక్షల విషయం లో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తామని.. రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తాము అంటూ ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఒక గదికి 15 నుండి 18 మంది విద్యార్థులకు ఉండేలా జాగ్రత్తలు పాటిస్తాము అంటూ తెలిపింది. ఇక ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కోవిడ్ ప్రొటోకాల్ ని పాటిస్థాము అంటూ ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి మరి.