శభాష్ పోలీస్.. సమయస్ఫూర్తితో ప్రాణం నిలిపాడు?

praveen
పోలీస్ అంటే అందరికీ గుర్తొచ్చేది..  ఖాకీ డ్రెస్సు.. కఠినమైన మనసు ఎవరైనా నేరం చేస్తే ఇక వారిపై విరుచుకు పడే తత్వం.  అందుకే జనాలు పోలీసులను చూస్తే ఎక్కువగా భయపడుతూ ఉంటారు. నేటి రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి. పోలీసులంటే వాళ్లకి కూడా మనసు ఉంటుందని.. వాళ్ళు కూడా మనలాంటి ఒక సాదాసీదా మనుషులే అని జనాలు అర్థం చేసుకుంటున్నారు. పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రజలకు మరింత దగ్గరగా ఉంటున్నారు.  సమయం వచ్చినప్పుడల్లా తమ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు వేస్తున్న ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి.



 విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి ఇప్పటివరకు ఎన్నో సార్లు  ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఘటనలు తెర మీదికి వచ్చి పోలీస్ అంటే అందరిలో మరింత గౌరవం పెంచాయ్. ఇక ఇప్పుడు వెలుగులోకి  వచ్చిన ఘటన చూస్తే పోలీస్ ని చూస్తే చేతులెత్తి మొక్కుతారు అందరు.  ఇక్కడ ఒక కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి ఏకంగా గాల్లో కలిసి పోవాల్సిన ప్రాణం కాస్తా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. ఇక ఈ పోలీస్ చేసిన పనికి ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.



 ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా హెచ్బి కాలనీ వద్ద బొమ్మకల్ కు చెందిన అబ్దుల్ అనే వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో ఇక వేగంగా దూసుకువచ్చిన బైక్ అతన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అబ్దుల్. కనీసం ఊపిరి కూడా తీసుకోవడం లేదు. అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. మూడు నిమిషాలపాటు ఇక అతని గుండె పై ప్రెస్ చేస్తూ సిపిఆర్ నిర్వహించాడు. ఇక అనంతరం అబ్దుల్ కి చలనం వచ్చింది. దీంతో వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా అతను కోలుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: