నేటి నుంచే స్కూళ్లు, కాలేజీలకు రండి.. కేసిఆర్ ఆదేశాలు?
అయితే విద్యార్థులు బడి కి రావడం తప్పనిసరి కాదు అనే నిబంధన కూడా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపోతే ఇటీవలే పాఠశాలలో టీచర్లు జూనియర్ కాలేజీ లో పనిచేసే లెక్చరర్లకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే విధుల్లో హాజరు కావాలి అంటూ సూచించింది. ఇక గతంలో ప్రత్యేక తరగతులు ప్రారంభించినప్పటికీ ఇటు కరోనా వైరస్ కేసులు పెరిగి పోవడంతో చివరికి విద్యాసంస్థలను మూసివేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇక రెండు నెలల పాటు ఉపాధ్యాయులు ఇంటికే పరిమితమయ్యారు.
ఇక ఇప్పుడు రెండు నెలల విరామం తర్వాత స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో విధులకి హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు టీచర్లు కాలేజీ లో పనిచేసే జూనియర్ లెక్చరర్లు. జులై 1వ తేదీ నుంచి స్కూల్లో కాలేజీ లో ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలోనే అటు స్కూళ్లను సిద్ధం చేయాలని అడ్మిషన్లు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని టీచర్లు జూనియర్ లెక్చరర్ లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అయితే విద్యార్థులు బడులకు వెళ్లడంపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేయనుంది ప్రభుత్వం.