జాతీయ పార్టీలు ఇక ‘నోటా’ పార్టీ లేనా?

M N Amaleswara rao

కాంగ్రెస్, బీజేపీ... జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న బడా పార్టీలు ప్రస్తుతం బీజేపీదే పైచేయి అయినా, కాంగ్రెస్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ పార్టీ ఏ క్షణాన్నైనా పుంజుకునే అవకాశముంది. అలా జాతీయ స్థాయిలో పేరొందిన కాంగ్రెస్, బీజేపీలు ఏపీలో మాత్రం సత్తా చాటలేకపోతున్నాయి. రాష్ట్ర విభజన ముందు వరకు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు తిరుగులేదు. కానీ ఎప్పుడైతే రాష్ర్ట విభజన చేసిందో అప్పటినుంచి, ఏపీలో కాంగ్రెస్ పని ఖతం అయింది.


ఆ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతుంది. ఆ పార్టీకి చెందిన నేతలంతా వైసీపీ, టీడీపీల్లోకి వెళ్ళిపోయారు. దీంతో ఆ పార్టీ చాప్టర్ చాలావరకు క్లోజ్ అయింది. అసలు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నోటా కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. అంటే దీని బట్టి కాంగ్రెస్ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పైగా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో, ఏపీలో కూడా ఆ పార్టీకి ఏది కలిసిరావడం లేదు. అసలు ఇంకా ఏపీలో ఆ పార్టీకి భవిష్యత్ కనిపించడం లేదు.


అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఏపీలో మాత్రం హడావిడి చేస్తుంది గానీ, ప్రజలకు దగ్గరవ్వడంలో మాత్రం వెనుకబడి ఉంది. ఈ పార్టీకి కూడా 2019 ఎన్నికల్లో నోటా కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. అయినా సరే కేంద్రంలో అధికారంలో ఉండటంతో, నెక్స్ట్ ఎన్నికలకు పుంజుకుంటామని చెబుతుంది. కానీ పరిస్తితి చూస్తే అలా కనిపించడం లేదు. జనసేనతో పొత్తు పెట్టుకున్నా సరే బీజేపీకి ఓటు బ్యాంక్ పెరగడం లేదు.


పైగా హోదా, విభజన హామీల అమలులో అన్యాయం చేస్తుండటంతో ఏపీ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనతో పాటు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి కాస్త ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. లేదా వైసీపీతో కలిసి ముందుకెళ్లిన అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్తితి కనిపించడం లేదు. కాబట్టి ఏపీలో బీజేపీకి కూడా భవిష్యత్ కనిపించడం లేదనే చెప్పొచ్చు. ఏదేమైనా రెండు జాతీయ పార్టీలు ఏపీలో మాత్రం ‘నోటా’ పార్టీలుగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: