మనం తరచూ లాయర్, అడ్వకేట్ అనే పదాలను వింటుంటాం. ఈ రెండు పదాలకూ ఒకటే అర్థం అని భావిస్తుంటాము. కానీ ఈ రెండు పదాలకు చాలా డిఫరెంట్ అర్థాలు ఉన్నాయి. వాటికున్న ఆ వేర్వేరు అర్థాలు ఏంటో.. ఈ రెండు పదాలను ఎప్పుడు వాడాలో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
ఎవరైతే లా డిగ్రీ కంప్లీట్ చేస్తారో వారందరినీ లాయర్లు ఉంటారు. అయితే చట్ట విభాగంలో అడ్వకేట్, అటార్నీ, సోలిసిటర్ తదితర రకాల లాయర్లు ఉంటారు. అయితే ఒక్కొక్క లాయర్ ఒక్కో రంగంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఒక సాధారణ లాయర్ న్యాయస్థానం లో అడుగుపెట్టి క్లయింటు తరపున వాదించడానికి వీల్లేదు. ఒకవేళ లాయర్లు న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే.. వారు స్టేట్ బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆల్ ఇండియా బార్ పరీక్షలో (AIBE) పాస్ అవ్వాల్సి ఉంటుంది.
ఈ రెండు పూర్తిచేసిన లాయర్లు ఒక అడ్వకేట్ కింద చేరి లా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కేవలం అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారిని లాయర్స్ అంటారు. కానీ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ అనగా LLB డిగ్రీ పట్టా ఉండి.. బార్ పరీక్షలో కూడా పాస్ అయితే వారిని అడ్వకేట్స్ అని పిలుస్తుంటారు. ఈ అడ్వకేట్స్ న్యాయస్థానంలో నిల్చొని తమ క్లయింట్ల తరఫున వాదించవచ్చు. కేవలం లా చదువుకున్న లాయర్లు కోర్టులలో వాదించడానికి వీలు లేదు కానీ వారు మాత్రం లా గురించి సలహాలు ఇవ్వవచ్చు.
అయితే అడ్వకేట్స్ తో పోల్చుకుంటే లాయర్ల ఛార్జ్ చేసే ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం వారికి ఎటువంటి ప్రాక్టికల్ అనుభవం లేకపోవడమే. అడ్వకేట్స్ పరీక్షలు క్లియర్ చేసి.. కోర్టులో లా ప్రాక్టీస్ చేసి కేసులు వాదించడంలో ఎంతో అనుభవం కలిగి ఉంటారు. కాబట్టి వారు లాయర్ల కంటే ఎక్కువగా ఫీజు వసూలు చేస్తుంటారు.
అడ్వకేట్స్ అందరూ లాయర్స్ అవుతారు కానీ లాయర్లు అందరూ అడ్వకేట్స్ కాలేరు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్ల ప్రవర్తనను నియంత్రించదు. కానీ అడ్వకేట్స్ కార్యకలాపాలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. లాయర్లు బిజినెస్ చేసుకోవచ్చు లేదా మరేతర వృత్తిలోనైనా కొనసాగవచ్చు. కానీ అడ్వకేట్స్ నేరుగా ఎటువంటి బిజినెస్ చేయకూడదు. అలాగే మరేతర రంగంలో కూడా జాబ్ చేయకూడదు. లాయర్లు లా గురించి బోధించవచ్చు. అడ్వకేట్స్ కూడా విద్యా కార్యకలాపాలలో పాటిస్పేట్ చేయొచ్చు కానీ ఫుల్ టైమ్ లా టీచర్ గా మారకూడదు.