లిప్ లాక్ ఎఫెక్ట్.. చివరికి మంత్రి పోయింది?
ఇలాంటి ఘటనలు తెర మీదికి వచ్చినప్పుడు అందరూ అవాక్కవుతుంటారూ. అయితే ఇక్కడ ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చివరికి తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు ఇక్కడ ఒక ప్రజా ప్రతినిధి . హుందాగా వ్యవహరించకుండా ఏకంగా తన సహా అధికారితో రొమాన్స్ లో మునిగిపోయాడు. ఏకంగా ఎవరికీ కనబడకుండా లిప్ లాక్ చేసేసాడు. కానీ సీక్రెట్ గా ఉన్న కెమెరా మాత్రం వీరి ఫోటోను పట్టేసింది. ఇక ఈ ఫోటో కాస్త మీడియా చేతికి చిక్కింది. ఇక ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మీడియా బాదుడు తట్టుకోలేక చివరికి తనకి తానే పదవికి రాజీనామా చేసేసాడు ఆ మంత్రి .
ఇది ఎక్కడ జరిగింది అని అంటారా.. మన దేశంలో కాదు లెండి యూకే లో జరిగింది. యూకే ఆరోగ్య శాఖ మంత్రి మాన్ హాట్ కాక్ తన సహా అధికారిని ఎవరికీ కనపడకుండా లిప్ కిస్ చేసిన ఫోటో కాస్త అక్కడి స్థానిక పత్రిక ఒకటి ప్రచురించింది. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అది కూడా ఇక ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని.. ఒకరితో ఒకరు శారీరక సంబంధాలు కొనసాగించ వద్దు అని ప్రభుత్వ నిబంధన విధించిన సమయంలో మంత్రి ఇలా వ్యవహరించాడు. దీనిపై మీద ఎన్నో కథనాలు ప్రచురితం చేయగా.. తాను కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఒప్పుకొని చివరికి తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు ఆరోగ్య శాఖ మంత్రి.