అత్తపై వేడి నూనె పోసిన కోడలు.. జగన్ డబ్బులే కారణం?

praveen
ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. కేవలం పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా కొంత మంది దారుణంగా వ్యవహరిస్తున్నారు. మనం కూడా మనుషులమే అన్న విషయాన్ని మరిచిపోయి..  సాటి మనుషుల విషయంలో క్రూరమృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కోడల్ని వేధించిన అక్క గురించి వినే ఉంటారు ప్రతి ఒక్కరు.



 వేధింపులు తాళలేక ఎంతోమంది కోడళ్ళు చివరికి మనస్థాపంతో కుంగిపోయి బాధపడుతూ ఉన్న ఘటనలు కూడా చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా సీన్ రివర్స్.  అత్తను  కాదు.. కోడలే దారుణంగా అత్తను వేధించింది.  మరి ఎంత దారుణంగా అని అనుకుంటున్నారా.. ఏకంగా సలసల కాగుతున్న నూనెను ముఖం పై పోసింది శాడిస్ట్ కోడలు.  కోడలు మరి అంత శాడిస్ట్ ఇలా ప్రవర్తించడానికి కారణం ఎవరు అని అంటారా.. ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. ఏంటి అత్తా కోడళ్ళ మధ్య గొడవ కే సీఎం జగన్ కారణం అదెలా అంటారా.



 ఇప్పుడు తెలుసుకుందాం.  గుడివాడలోని మందపాడు కు చెందిన లక్ష్మీ ఖాతాలో ఇటీవలే వైయస్సార్ చేయూత కింద జగన్ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు జమ అయ్యాయి. విషయం తెలుసుకున్న కోడలు ఆ డబ్బులు ఎలాగైనా సొంతం చేసుకోవాలి అనుకుంది.  డబ్బులు ఇవ్వాలి అంటూ అత్తను కోరింది. అత్త మాత్రం డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అంది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం జరిగింది.  ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తురాలైన  కోడలు పక్కనే సలసల కాగుతున్న నూనెను అత్తపై పోసింది.  దీంతో వృద్ధురాలు లక్ష్మీ కి కాస్త తీవ్ర గాయాలపాలయ్యాయ్.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Oil

సంబంధిత వార్తలు: