అన్న జగన్ తో కొట్లాటకైనా సిద్ధం : వైయస్ షర్మిల

praveen
గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తోంది. తెలంగాణకు రావాల్సిన నీటిని అటు ఆంధ్ర ప్రభుత్వం  దోచుకు పోతుంది అంటూ కెసిఆర్ ప్రభుత్వ తీరుపై అటు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇక జల వివాదం కాస్త క్రమక్రమంగా ముదురుతున్నట్లు కనిపిస్తోంది. అయితే తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తీసుకు వస్తానని ప్రజల పక్షాన పోరాడుతా అంటూ వైఎస్ షర్మిల ప్రకటించారూ. త్వరలో పార్టీని స్థాపించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని ఒక్కో సమస్యపై స్పందిస్తూ వస్తున్నారు వైయస్ షర్మిల.

 ఇప్పటికే నిరుద్యోగుల సమస్యలు సహా పలు సమస్యలపై స్పందించి ఇక ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు వైయస్ షర్మిల. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం గురించి స్పందించారు. అయితే మిగతా ప్రతిపక్షాలు లాగానే.. వైయస్ షర్మిల  తెలంగాణకు వచ్చే జలాలను ఆంధ్ర కి తీసుకు వెళుతూ ఉంటే చూస్తూ ఊరుకోం అంటూ వ్యాఖ్యానించారు.  ఇక తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటానికి ఎంతవరకైనా వెళ్తాను అంటూ ఇటీవలే వైఎస్ షర్మిల వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా అయితే ఏపీ లో వైఎస్ షర్మిల అన్న జగన్ అధికారంలో ఉన్నారు. దీంతో జల వివాదంపై షర్మిల ఎక్కువగా మాట్లాడరు అని అనుకున్నారు అందరు.

 కానీ తెలంగాణ ఏపీ మధ్య తలెత్తిన వివాదం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైయస్ షర్మిల. ఖమ్మంలో పార్టీకి సంబంధించి మొదటి సభలో చేసిన వ్యాఖ్యలను ఇటీవల సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణకు రావలసిన ఒక్క నీటి చుక్క కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని దీనికోసం ఎవరితో అయిన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే ఏ ప్రాజెక్టు అయినా.. ఏ పని అయినా అడ్డుకుంటాను అంటూ శబదం  చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతా అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.  ఇక దీన్ని బట్టి చూస్తే ఇండైరెక్ట్గా ఏపీలో అధికారంలో ఉన్న తన అన్నతో కూడా జల హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధం అని వైఎస్ షర్మిల చెప్పకనే చెప్పారు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: