దూసుకుపోతున్న భారత్.. ఆ విషయంలో అమెరికాను దాటేసింది?

praveen
ప్రస్తుతం భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.  అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి వ్యాక్సిన్ కనుగొనేందుకు చాలా దేశాలు పరిశోధనలు జరిపాయి. అయితే కొన్ని దేశాలు మాత్రమే వ్యాక్సిన్ కనుగొనడంలో విజయం సాధించగలగాయ్. ముఖ్యంగా అమెరికా బ్రిటన్ రష్యా లాంటి దేశాలు ముందుగా వ్యాక్సిన్ను అత్యవసర వినియోగంలోకి తీసుకువచ్చాయి. ఇలాంటి సమయంలో 130 కోట్ల జనాభా కలిగిన భారత్ అగ్రరాజ్యాల ముందు టీకా కోసం చేయి చాచే పరిస్థితి వస్తుందా అని అనుకున్నారు అందరు. కానీ అటు అగ్రరాజ్యాలకు పోటీగా భారత శాస్త్రవేత్తలు కూడా వ్యాక్సిన్ కనుగొనడంలో విజయం సాధించారు.




 భారత్లో దాదాపు 5  పైగా వ్యాక్సిన్ కు సంబంధించిన పరిశోధనలు జరగాయి. ఇక ముందుగా సీరం ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన కోవిషీల్డ్ భారత్ బయోటెక్ కి సంబంధించిన కోవ్యాక్సిన్ టీకాలు 2-దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోవడంతో ఇక వాటికి అత్యవసర వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు  పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.  టీకా ప్రక్రియలు భారత్ దూసుకుపోతున్న తీరు అగ్రరాజ్యాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే వాక్సినేషన్ లో భారత్ ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికా ను కూడా దాటేసింది.



 ఇప్పటివరకు అమెరికాలో సింగల్ డోస్ 32 కోట్ల 33 లక్షల మందికి ఇచ్చారు.  తాజాగా భారత్ ఇక అమెరికా ని క్రాస్ చేసింది.  32 కోట్ల 36 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందించింది భారత్. అగ్రరాజ్యమైన అమెరికాను ఇలా వ్యాక్సినేషన్ ప్రక్రియలో దాటేసింది.  ఒక వెనుకబడిన దేశంగా ఉన్న భారత్ ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియలో అగ్రరాజ్యాన్ని సైతం దాటేయడం గొప్ప విషయం అని అంటున్నారు విశ్లేషకులు. అయితే జనాభా పరంగా చూసుకుంటే అటు అమెరికాలో ఇప్పటికే 90% శాతం వ్యాక్సినేషన్  పూర్తయిందని కానీ వ్యాక్సిన్ డోసులు పరంగా చూసుకుంటే భారత్ మాత్రం అమెరికాను దాటేసింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: