ఆశ్చర్యం : ఇప్పటి వరకు వర్షం కురవని గ్రామం..!

NAGARJUNA NAKKA
ఈ భూ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. ఎన్నో విచిత్రాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇప్పటికీ మనకు ఎన్నో తెలియనివి దాగి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కువగా వర్షాలు కురిసేది  మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామాంలోనే. కానీ ఇంత వరకు వర్షం కురవని ప్రదేశం కూడా ఉంది. యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉన్న ‘అల్-హుతైబ్’ గ్రామంలో ఇప్పటి వరకు వర్షమే పడలేదు. ఎందుకంటే ఈ గ్రామం మేఘాలకు మించి ఎత్తులో ఉంటుంది. ఈ విలేజ్ కు దిగువ భాగాన మాత్రం మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఆ వర్షాలు పడటాన్ని ఈ గ్రామస్థులు చూస్తారట. కానీ తమ విలేజ్ లో మాత్రం వానలు కురవవు. ఈ వింత ప్రదేశానికి వచ్చేందుకు పర్యాటకులు క్యూకడతారు.  
 ‘అల్-హుతైబ్’ గ్రామం భూ ఉపరితలానికి 3వేల 200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ గ్రామంలోని వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. రాత్రుల వణికించే చలి ఉండగా.. పగలు సూర్యుడు రాగానే ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఇది ఈ ప్రాంత వాసులకు అలవాటే. పర్యాటకులు కూడా ఈ వాతావరణాకి బాగానే అలవాటు పడిపోతారు. ఈ గ్రామంలో పాత కాలపు నిర్మాణలతో పాటు.. కొత్త నిర్మాణాలు కూడా దర్శనమిస్తాయి.
ఇదిలా ఉంటే భారత్ లో నైరుతి రుతుపవనాలు ఈ నెలలో సాధారణంగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ చెబుతోంది.  సగటున 94 నుంచి 106 శాతం వర్షాలు పడతాయని వెల్లడించింది. జులై మాసంలో మొదటి వారంలో ఊహించని విధంగా వర్షాలు కురవకపోవచ్చని అభిప్రాయపడింది. ఇక రెండో వారంలో వర్షాలు జోరుగా పడతాయని స్పష్టం చేసింది. అంతేకాదు ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఆ ఉష్ణోగ్రతలు ఇప్పట్లో తగ్గవని చెప్పింది.  పంజాబ్, హర్యానా, ఢిల్లీ  ఉత్తర రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వేడిగాలులు కొనసాగుతాయని పేర్కొంది. ఇటీవల అక్కడ టెంపరేచర్  40 డిగ్రీలు దాటింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: