ప్రశాంత్ కిషోర్ శిష్యురాలే షర్మిలకు వ్యూహకర్తా...!
తమిళనాడులో స్టాలిన్ తో పాటు బెంగాల్లో మమతకు కూడా పనిచేసి వారిని అధికారంలోకి తీసుకు వచ్చారు. బెంగాల్లో మమత గెలుపు కోసం పీకే ఏకంగా మోడీతో సవాల్ చేసి మరీ విజయం సాధించారు. ఇక ఇప్పుడు దే శ వ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలకు పీకే శిష్యులు స్ట్రాటజిస్టులుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు పీకే శిష్యుడు రాబిన్ శర్మ పని చేస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ పెడుతోన్న షర్మిలకు కూడా పీకే శిష్యురాలే కొత్త వ్యూహకర్త గా ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఆమె కూడా పీకే శిష్యురాలే కాగా తమిళనాడుకు చెందిన ఆ వ్యూహకర్త పేరు ప్రియ. షర్మిల మహిళ కావడంతో ఆమె వ్యూహాత్మకంగా మహిళా వ్యూహకర్తనే ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రియ కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తే. తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె. ఆమె ఈ రోజు లోటస్ పాండ్ లో షర్మిషలను కలిసి పలు అంశాలపై చర్చించారు. సోషల్ మీడియాతో పాటు పార్టీ వ్యూహాలపై షర్మిలకు వ్యూహకర్తగా ప్రియ వ్యవహరించనున్నారు. ఆమె తమిళనాడులో ఓ మీడియా అధినేత కూడా..! మరి ప్రియ వ్యూహాలు షర్మిలకు ఎంత వరకు కలిసొస్తాయో ? చూడాలి.