ప్ర‌కాష్‌రాజ్‌కు స్టార్ డైరెక్ట‌ర్ స‌పోర్ట్‌..!

VUYYURU SUBHASH
తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు జరిగేందుకు మరో మూడు నెలల సమయం ఉన్నా... ఇప్పటికే ఎన్నికల వేడి ర‌గులకుంది. పైకి అంతా సైలెంట్ గా ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా తెర వెనక ఎవరి మంత్రంగా వారు చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్‌ను ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మరోవైపు మంచు విష్ణు సైతం తాను కూడా మా ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు మా ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నటుడు నరేష్ సైతం యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక మా నటీనటుల్లో కొందరు ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేస్తుంటే... మరికొందరు మంచు విష్ణు కు మద్దతు తెలుపుతున్నారు. జీవితా రాజశేఖర్ ...హేమ కూడా పోటీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక తెలంగాణ వాదంతో పాటు తెలంగాణ క‌ళాకారుల‌కు న్యాయం జ‌ర‌గాలంటూ సీనియ‌ర్ న‌టుడు సీవీఎల్‌. న‌ర‌సింహా రావు సైతం తాను కూడా మా ఎన్నిక‌ల్లో ఏకంగా అధ్య‌క్ష ప‌దవికే పోటీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి బాంబు పేల్చారు. ఇదిలా ఉంటే ప్ర‌కాష్ రాజ్‌కు ఇప్ప‌టికే మెగా కాంపౌండ్ మ‌ద్ద‌తు ఉంద‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఆయ‌న కూడా ఈ విష‌యం చెప్పుకున్నారు. ఆయ‌న గెలుపు కోనం నాగ‌బాబు వ్యూహాలు ప‌న్నుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ కు ఓ స్టార్ డైరెక్టర్ సపోర్ట్ చేయడంతోపాటు తెర వెనుక ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆ స్టార్ డైరెక్టర్ తన ఆఫీసు కేంద్రంగా చేసుకొని ప్రకాష్ రాజ్ గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నట్లు టు మా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. స‌ద‌రు డైరెక్ట‌ర్ సినిమాల్లో ప్ర‌కాష్ రాజ్ గ‌తంలో విల‌న్ క్యారెక్ట‌ర్ల‌తో పాటు ప‌లు ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేశాడు. వారిద్ద‌రు ఎంతో స‌న్నిహితంగా ఉంటారు. అందుకే ఇప్పుడు స‌ర‌దు డైరెక్ట‌ర్ త‌న ఆఫీస్‌నే ప్ర‌కాష్ రాజ్ ఎన్నిక‌ల ఆఫీస్‌గా వాడుకోమ‌ని చెప్ప‌డంతో పాటు అన్నీ తానే అయ్యి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: