ఈ యాప్‌లు వాడారో.. కొంప కొల్లేరే..?

Chakravarthi Kalyan
స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక యాప్‌ల వాడకం బాగా పెరిగిపోయింది.. ఫోటో ఎడిట్ చేయాలన్నా యాప్.. లెక్క చేయాలన్నా యాప్.. వాయిస్ పెంచాలన్నా యాప్.. వీడియో చేయాలన్నా యాప్.. టెక్నాలజీ పెరిగి అనేక యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. ఈ యాప్‌లలో అన్నీ సురక్షితం కావు. కొన్ని యాప్‌లు చాలా ప్రమాదకరం కూడా. ఆ యాప్‌లు వాడితే మీ ఫోన్ చిక్కుల్లోపడినట్టే.. మీ ఖాతాల నుంచి డబ్బు మాయం కావచ్చు.. మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చేరవచ్చు.


అలా ఎందుకు జరుగుతుందంటే.. యాప్‌ల ద్వారా ఫేస్‌ బుక్‌ యూజర్స్‌ లాగిన్‌, పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు సేకరిస్తున్నారు. వాటిని దుర్వినియోగం చేస్తున్నారట. ఈ విషయాన్ని  డాక్టర్‌ వెబ్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థకు చెందిన మాల్‌వేర్ అనలిస్ట్ విభాగం బయటపెట్టింది. వినియోగదారుల డేటా భద్రత కోసం టెక్ కంపెనీలు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా ఇలాంటి హ్యాకర్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారట. ప్రత్యేకించి గూగుల్  ప్లేస్టోర్‌లోని 9 ఫొటో ఎడిటింగ్  యాప్‌లను హ్యాకర్లు బాగా వాడుతున్నారట.


అందుకే గూగుల్‌ ముందు జాగ్రత్త చర్యగా  ఆ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తీసేసింది. ప్రత్యేకమైన సాంకేతిక సాయంతో హ్యాకర్స్‌ ఈ యాప్‌లలోకి ప్రవేశించి సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తున్నారు. తద్వారా మన  సమాచారం అంతా సేకరిస్తున్నారని డాక్టర్ వెబ్‌ వెల్లడించింది. సెట్టింగ్స్ మార్పుల తర్వాత  WebView.Next పేరుతో జావా స్క్రిప్ట్‌ సాయంతో ఫేస్‌బుక్ పేజీలో మార్పులు చేస్తారట. యూజర్స్ లాగిన్‌, పాస్‌వర్డ్ వివరాలను సేకరించి ట్రాజన్‌ యాప్స్‌ ద్వారా తమ సర్వర్లో సేవ్‌ చేసుకుంటున్నారట.

 

ఇక యూజర్స్ తమ ఖాతాల్లోకి లాగిన్‌ అయినప్పుడు కుకీస్‌తో పాటు ఇతర డేటా వివరాలను సేకరించేస్తారు. వాటిని  సైబర్‌ నేరగాళ్లకు అందజేస్తున్నారు. అందుకే గూగుల్ వీటిని తొలిగించింది. ఆ యాప్‌లు ఏంటంట.. పిఐపి ఫొటో (PIP Photo), ప్రాసెసింగ్ ఫొటో (Processing Photo), రబ్బిష్ క్లీనర్ (Rubbish Cleaner), హారోస్కోప్ డైలీ (Horoscope Daily), ఇన్‌వెల్‌ ఫిట్‌నెస్‌ (Inwell Fitness), యాప్‌ లాక్ కీప్‌ (App Loc Keep), లాకిట్ మాస్టర్‌ (Lockit master ), హారోస్కోప్‌ పై (Horoscope Pi), యాప్‌ లాక్ మేనేజర్‌ (App Lock Manager). అందుకే మీరు కూడా ఈ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకుని వాడుతుంటే వెంటనే అన్ ఇన్‌స్టార్‌ చేసేయండి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: