మందుబాబులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బీరు ధర?
ముఖ్యంగా తెలంగాణ లో అయితే ఇలా మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్జీస్తూ ఉంటుంది. అయితే ప్రభుత్వానికి ఇంత ఆదాయం ఇస్తున్న మందు బాబులకు సీఎం కేసీఆర్ ఏదైనా చేయాలి అనుకున్నారో ఏమో. ఇక ఇటీవల మందుబాబులకు ఒక చల్లటి వార్త వినిపించారు గతంలో మద్యం ధరలు భారీగా పెరిగిపోవడం తో ఆందోళనలో మునిగి పోయిన మందుబాబులకు తీపికబురు చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. మద్యం ధరలు తగ్గిస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న అన్ని రకాల బీరు బ్రాండ్ లపై ఏకంగా పది రూపాయలు తగ్గిస్తున్నట్లు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అన్ని రకాల బీర్ బ్రాండ్ లపై ప్రత్యేక సెస్ నుండి పది రూపాయలు తగ్గిస్తున్నట్లు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది . అయితే ప్రస్తుతం ప్రభుత్వం తగ్గించిన ధర ఈ రోజు అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తుంది అంటు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే ప్రస్తుతం మద్యం షాపుల్లో ఉన్న పాత స్టాక్ పై మాత్రం అదే ధరలు కొనసాగుతాయి అంటూ స్పష్టం చేశారు. ఇది నిజంగా మందు బాబులు అందరికీ ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి.