ముఖం పగలగొడతా.. స్టూడెంట్ కి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే?

praveen
సాధారణంగా రాజకీయ నాయకులు అన్న తర్వాత ఎప్పుడూ ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కాస్త నోరు జారారు అంటే చాలు తీవ్రస్థాయిలో విమర్శలు ఫాలవుతుంటారు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది రాజకీయ నాయకులు  చేసిన కొన్ని కొన్ని వ్యాఖ్యలు ఎన్నో విమర్శలు పాలు చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి   అయితే తాజాగా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రజా ప్రతినిధులు అన్న తర్వాత ఎంతోమంది ప్రజలు ఇక వారికి ఫోన్ చేసి సమస్యల గురించి చెప్పుకుంటూ ఉంటారు.  సహాయం చేయాలి అంటూ వేడుకుంటూ ఉంటారు. ఇలా సహాయం కావాలి అంటూ అడిగినప్పుడు ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు.



 ఇక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు వెంటనే నియోజకవర్గ ప్రజలకు దగ్గరకు వెళ్లి స్వయంగా సమస్యలను పరిష్కరించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తించాడు .  ఇటీవలే ఎమ్మెల్యే సహాయం కోసం ఒక విద్యార్థి ఫోన్ చేయగా అతని పట్ల ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు మాత్రం ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. సహాయం చేస్తాను అని అనకపోగా  ఏకంగా వార్నింగ్ సైతం ఇచ్చాడు ఆ ఎమ్మెల్యే. దీంతో ఇక సహాయం కోసం ఫోన్ చేసినా ఆ విద్యార్థి నిరాశతో ఎమ్మెల్యే కు క్షమాపణలు చెప్పి ఫోన్ కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 కేరళలోని కొల్లం ఎమ్మెల్యే నటుడు ముఖేష్ ఒక విద్యార్థి పట్ల ఈ తరహా ప్రవర్తన తో ప్రస్తుతం వార్తల్లో నిలిచి విమర్శల పాలవుతున్నాడు. ఇటీవలే ఎమ్మెల్యే ముఖేష్ కు ఒక టెన్త్ విద్యార్ధి ఫోన్ చేశాడు  తన కుటుంబం ఎంతో ఆర్థిక సమస్యల్లో ఉందని తన చదువుకు కూడా ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది అంటూ తమ బాధలు చెప్పుకున్నాడు. సహాయం చేసి తమను ఆదుకోవాలి అంటూ ఎంతో దీనంగా కోరాడు. ఇలాంటి సమయంలో ఒక ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా సానుకూలంగా స్పందించాల్సింది పోయి ఆ యువకుడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఎమ్మెల్యే. ఈ సమయంలో నువ్వు నా ఎదురుగా ఉంటే క్యాన్ తీసుకొని ముఖం పగలగొట్టే వాడిని అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భయపడిపోయిన ఆ పదవ తరగతి విద్యార్థి వెంటనే ఎమ్మెల్యే కు క్షమాపణలు చెప్పి ఫోన్ కట్ చేసాడు. ఈ విషయం బయటకు రావడంతో ఎమ్మెల్యే తీరు పై విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: