కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ లు డుమ్మా... బూస్టర్ షాట్ లే గతి ?

VAMSI
ప్రపంచంలో కోవిడ్ 19 పై రోజు రోజుకీ చర్చలు పెరిగిపోతున్నాయి. రానున్న కాలంలో ఈ వైరస్ నుండి మరిన్ని  వేరియంట్లు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నందున ఇప్పటి నుండే వాటి నుండి రక్షణ పొందడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం భారతదేశంలోని ప్రజారోగ్య నిపుణులు, ఎపిడెమాలాజిస్టులు, కరోనా వైద్య నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ల  నుండి రక్షించబడడానికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ షాట్స్ ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దేశంలో గత ఆరు నెలల నుండి టీకాలను ఇస్తున్నారు. అయితే అంతకు ముందు నుండి ఇప్పటి వరకు ప్రజలలో వ్యాక్సిన్ ల పట్ల సానుకూల దృక్పధం లేదు. వీటి పనితీరుపై అనుమానాలున్నాయి. తాత్కాలికంగా ఈ వ్యాక్సిన్ ల వాళ్ళ రోగ నిరోదక శక్తి వచ్చినా, భవిష్యత్తులో రోగ నిరోధక శక్తి బలహీనమయ్యే అవకాశం ఉందని పలు చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే వ్యాక్సిన్ బూస్టర్ ను తీసుకోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.  ఇది కొత్త  వేరియంట్లపై వ్యతిరేకంగా పనిచేసి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుందని నమ్ముతున్నారు.  


ఇదే అంశాన్ని హైదరాబాద్ డాక్టర్లు సైతం దీకి మద్దతు ఇస్తున్నారు. రానున్న రోజులలో ఈ బూస్టర్ షాట్ ల వలన భారీ ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ప్రజల నుండి కూడా ఈ బూస్టర్ షాట్ లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని బలంగా చెబుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయడానికే ఇబ్బందిగా మారుతున్న తరుణంలో ఇప్పటికే బూస్టర్ షాట్ ల ఉత్పత్తికి సంబంధించి చర్చలు జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ను తీసుకున్న వారు, బూస్టర్ షాట్ గా ఫైజర్ లేదా మోడెర్నా ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ లాంటి దేశాలు మరో రెండు నెలల తరువాత ఈ బూస్టర్ షాట్ ల ఉత్పత్తిని ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఇటీవల పూణెకి చెందిన ఎన్ఐవి డైరెక్టర్ ప్రియా అబ్రహం ప్రమాదకరమైన వేరియంట్ల నుండి కాపాడుకోవడానికి బూస్టర్ షాట్ లు మన ముందున్న ఛాయిస్ అని చెప్పారు. అయితే ఈమె చెబుతున్న ప్రకారం కోవ్యాక్సిన్ ను బూస్టర్ షాట్ గా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు.


కానీ పరిశోధనల నివేదికల ఆధారంగా కోవిషీల్డ్ నుండి బూస్టర్ షాట్ లను ఎక్కువ మొత్తంలో చేయవచ్చని నిరూపిస్తున్నాయి. వీటి కోసం ఇంగ్లాండ్ , దక్షిణాఫ్రికా, బ్రెజిల్ మరియు పోలాండ్ దేశాలలో బూస్టర్ వ్యాక్సిన్ పై ట్రైల్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ మాట్లాడుతూ టీకా మనకు శాశ్వతమైన రక్షణను అందించలేదని కాబట్టి భవిష్యత్తులో బూస్టర్ షాట్ అవసరం ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు. మరి ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: