కరోనాతో దెబ్బతిన్న కేసిఆర్ మెదడు?

praveen
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకూ ముదురుతోంది.  తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్ర వాళ్ళు పట్టుకు పోతున్నారూ అంటూ అటు తెలంగాణలోని అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.  అదే సమయంలో ఇక ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని అంటూ అటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. మొన్నటి వరకూ  అన్నదమ్ముల బంధం గా ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య బంధం కాస్త ఇక ఇప్పుడు జలవివాదంతో తెగిపోయే లాగే కనిపిస్తుంది.



 ఎన్నో రోజుల నుంచి ఈ జల వివాదం విషయంలో చర్చలు జరుగుతున్నప్పటికీ ఓ కొలిక్కి రావడం లేదు. ఇక చిలికి చిలికి గాలివాన అయినట్లు జలవివాదం అంతకంతకూ ముదురుతోంది.  ఇక తెలంగాణ అధికార పార్టీ నేతలు అందరూ అటు జగన్ తండ్రి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జగన్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.  ఇక తాజాగా ఏపీ బిజెపి ఎంపీ వెంకటేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.



 ఇటీవలే తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన కృష్ణా జలాల వివాదం విషయంలో స్పందించారు ఎంపీ వెంకటేష్. సాధారణంగా అయితే కరోనా వల్ల కొందరికి ఊపిరితిత్తులు గుండె దెబ్బ తింటూ ఉంటాయి. కానీ కెసిఆర్ కి కరోనా వల్ల మెదడు దెబ్బ తిన్నట్లు ఉంది అంటూ బీజేపీ ఎంపీ వెంకటేష్ సంచలన విమర్శలు చేశారు. 2015లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాలపై ఇచ్చిన నివేదికపై తెలుగు రాష్ట్రాలు  సంతకం చేశాయి  అనే విషయం మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. రాయలసీమకు అన్యాయం చేయాలని చూస్తే సహించబోమని అంటూ ఆయన హెచ్చరించారు.  కృష్ణా జలాల విషయంలో జగన్ ఇప్పటికైనా మౌనం వీడాలి అంటూ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: