చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదేనా..?
2009వ సంవత్సరంలో తొలిసారి చాక్లెట్ డేను జరుపుకున్నారు. అయితే ఘనా, అమెరికా లాంటి దేశాలు ఈ పండుగను ఈరోజు నిర్వహించుకోవు. ఎందుకంటే ఆ దేశాలు చాక్లెట్ డే కోసం స్వతంత్రంగా తేదీలను ప్రకటించుకున్నాయి. ఫిబ్రవరి 14న ఘనా, అమెరికా అక్టోబర్ 28వ తేదీన చాక్లెట్ డేను నిర్వహించుకుంటుంది. చాక్లెట్ డేను జరుపుకునేందు కారణం మాత్రం తెలియదుకానీ.. 16వ శతాబ్ధంలో చాక్లెట్ ను తొలిసారిగా యూరప్ కు తీసుకొచ్చినట్టు పెద్దల ద్వారా తెలుస్తోంది.
చాక్లెట్‌లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కనుక ఈ ప్రత్యేక రోజును చాక్లెట్ తినడం ద్వారా జరుపుకుంటారు. మార్కెట్‌లో కోకో పౌడర్, చాక్లెట్ మిల్క్, చోకో సిరప్, వంటి రకరకాల చాక్లెట్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. చాక్లెట్ లో ఎల్ ఆర్జినైన్ అనే ఆమ్లం ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. స్త్రీ, పురుష శరీరాలలో లైంగిక అవయవాలకు బ్లడ్ సర్క్యూలేషన్ చేయడం.. సెక్సువల్ కోరికలు పెంచడంలో తోడ్పడుతుంది. అందుకే చాక్లెట్ కు న్యాచురల్ సెక్స్ బూస్టర్ అని పేరు. గర్భిణులు రోజుకు 30 గ్రామలు చాక్లెట్ తీసుకోవడం వల్ల పిండం అభివృద్ధిలో బాగా తోడ్పడుతుంది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ లు మాత్రమే ఇన్ని ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉంటాయి. తెలుసుకున్నారు కదా.. చాక్లెట్ ఉపయోగాలు. ఎక్కడ డార్క్ చాక్లెట్ కనిపించినా ఖచ్చితంగా తీసుకొని తినండి. మీ ఆరోగ్యాన్ని
కాపాడుకోండి. హ్యాపీ చాక్లెట్ డే.