పాక్ సరిహద్దు మొత్తం సిద్ధం.. మోడీ భలే వ్యూహం?
కానీ కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆర్థిక బడ్జెట్ లో కూడా రక్షణ రంగానికి పెద్దపీట వేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే అధునాతన ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. అదే సమయంలో ఇక ఆయుధాలను తయారు చేసి ఆయుధ విక్రయాలను కూడా ప్రారంభించింది. ఇలాంటి సమయంలోనే సరిహద్దుల్లో శరవేగంగా సైనికులు అందరికీ మౌలిక వసతులు కల్పించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ఒకచోట నుంచి మరొక చోటుకు వెళ్లడానికి రోడ్లు వంతెనలు లాంటివి ఇప్పటివరకు భారత సైనికులు నోచుకోలేదు. ఇప్పుడు మాత్రం ఇలాంటి మౌలిక వసతులను భారత సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రక్షణ రంగానికి వందల కోట్లు కేటాయిస్తూ ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే అటు భారత్ చైనా సరిహద్దుల్లో గతంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కూడా మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. ఇక ఇటీవల పాకిస్థాన్ వ్యవహార శైలి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే విధంగా ఉండడం ఇక అంతే కాకుండా ఎప్పుడూ పాకిస్తాన్ భారత్ సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉండటంతో అక్కడ సైనికులకు మౌలిక వసతులు కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది ఏకంగా ఇటీవలే 110 మినీ వంతెనలను నిర్మించిందట కేంద్రం. 9 మీటర్ల పొడవు నాలుగు మీటర్ల వెడల్పుతో ఉన్న మినీ వంతెనను నిర్మించినట్లు తెలుస్తోంది అంతేకాకుండా వాటర్ బాడీస్, కెనాల్స్ లాంటి మరెన్నో మౌలిక వసతులను కూడా సైనికులకు కల్పించినట్లు తెలుస్తోంది.