ఓటమి ఎరుగని నేత వైఎస్ఆర్..!

NAGARJUNA NAKKA
విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి కనుబరిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. 1978వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి శాసనసభలో అడుగు పెట్టారు. అలా మొత్తం ఆరు సార్లు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అంతేకాదు నాలుగు సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్ పోటీ చేసిన ప్రతీ ఎలక్షన్ లలోనూ ఆయన్నే విజయం వరించింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 1978వ సంవత్సరంలో జనతాపార్టీ హవాను తట్టుకొని విజయం సాధించి.. మంత్రి పదవిలో కూర్చున్నారు. వరుసగా ముగ్గురు సీఎంలు మారినా ఆ మూడు మంత్రి మండళ్లలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం ఆయనకు ఎలాంటి పదవీ వరించలేదు.

1985వ సంవత్సరం నుండి 1998 వరకు కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ సీఎంలందరితోనూ పోరాడేవారు. మర్రి చెన్నారెడ్డి, జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి లాంటి లీడర్లతో పోరు సాగించారు. వారికి వ్యతిరేకిస్తూ ప్రత్యేకంగా క్యాంపులు నడిపారు. వైఎస్ 1983వ సంవత్సరంలో మొట్టమొదటి సారి పీసీసీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998లో కూడా పీసీసీ పగ్గాలు అందుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 1999 నుంచి 2004 వరకు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా రాణించారు. 1989-94 మధ్య సీఎం పదవి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కలేదు. 1999వ సంవత్సరంలో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికై... ప్రతిపక్షనేతగా ఉంటూ తర్వాతి ఎలక్షన్ లలో కాంగ్రెస్ పార్టీ విజయానికి పక్కా ప్లాన్ వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఓటమి ఎరుగని నేతగా పేరుంది. ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. వీరిద్దరూ మంచి స్నేహితులు.  

1985వ సంవత్సరం నుండి 1998 వరకు కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ సీఎంలందరితోనూ పోరాడేవారు. మర్రి చెన్నారెడ్డి, జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి లాంటి లీడర్లతో పోరు సాగించారు. వారికి వ్యతిరేకిస్తూ ప్రత్యేకంగా క్యాంపులు నడిపారు. రాజకీయాల్లో ముక్కుసూటితనం, నిర్మొహమాటానికి మారుపేరు వైఎస్ ఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: