మంత్రి బూట్ల‌కు ఉన్న విలువ‌..మ‌త్స్య‌కారుడి లేదా..?

ప్రజా సేవ చేస్తామని చెప్పుకుంటూ రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి ఎలాంటి సాహసమైనా చేయాలి. కానీ ప్ర‌స్తుతం ప్ర‌జాసేవ పేరుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఎంతో మంది నాయ‌కులు కాస్ట్లీ కారుల్లో తిరుగుతూ ఫుల్ గా సంపాదించేస్తున్నారు. త‌ర‌త‌రాలు కూర్చుని తినేలా ఆస్తులు కూడ‌బెట్టుకుంటున్నారు. అంతే కాదు అస‌లు కాళి గోరుకు కూడా మట్టి అంట‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మంత్రి బూట్లు పాడవుతాయ‌ని నీటిలో నడిచేందుకు వెనుకడుగు వేశాడు. దాంతో మత్స్య కారుడు మోసుకెళ్ళి మంత్రిని బోట్ ఎక్కించాడు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాంతో మంత్రిపై నెటిజన్లు చివాట్లు పెడుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే... తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి  అనితా రాధాకృష్ణన్ భారీ వర్షాలతో కోతకు గురైన సముద్ర ప్రాంతాన్ని పరిశీలించేందుకు తిరువల్లూరు జిల్లా లో పర్యటించారు. 


పర్యటనలో భాగంగా మంత్రి బోటు ఎక్కాల్సి వ‌చ్చింది. అయితే బోటు ఎక్కే ప్రాంతంలో నీరు ఉండ‌టంతో మంత్రి చిరాకు పడ్డారు. నీళ్ల‌లో త‌డిస్తే ఆయన ఖరీదైన బూట్లు పాడవ‌తాయని భావించాడు.  దాంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు మంత్రి కాలికి మట్టి అంటకుండా భుజాలపై వేసుకొని తీసుకువెళ్లి పడవలో ఎక్కించాడు. అలా మంత్రి పడలో చక్కర్లు కొట్టారు. త‌ర్వాత మళ్ళీ తిరిగి బయటకు వచ్చే సమయంలో కూడా బోట్ దిగేందుకు కాస్త ఆలోచించాడు. దాంతో దిగేటప్పుడు కూడా మత్స్యకారుడు మంత్రిని ఎత్తుకొని మళ్లీ అడుగు కింద పెట్టుకుండా ఒడ్డుమీద‌ వదిలిపెట్టాడు. 


దీనిని సంబంధించిన వీడియోను స్థానిక మీడియా సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాంతో తమిళనాడు ప్రజలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఆ మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బురదలో నడవని మంత్రి ప్రజలకు ఏం సేవ చేస్తార‌ని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మంత్రి బూట్లకు ఇస్తున్న విలువ మత్స్యకారులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: