కెసిఆర్ కోరారు.. ఓకే చెప్పేశాను : ఎల్ రమణ
ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతిభవన్లో ఎల్.రమణ సమావేశమయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశంలో పాల్గొన్నారు ఎల్.రమణ. ఇక ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎల్.రమణ వివిధ అంశాలు చర్చకు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం కలిసి ముందుకు నడవాలని అందుకోసం టిఆర్ఎస్ లోకి రావాలి అంటూ కేసీఆర్ కోరారు. అయితే సానుకూలంగానే నిర్ణయం ఉంటుందని కెసిఆర్కు తెలిపినట్లు ఎల్.రమణ చెప్పుకొచ్చారు.
అనంతరం మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎల్.రమణ అంటే కెసిఆర్ కు ఎంతో అభిమానం అంటూ చెప్పుకొచ్చారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన ఎల్.రమణ లాంటి నేతలు టీ ఆర్ ఎస్ కి ఎంతో అవసరం అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే తమ ప్రభుత్వం చేనేత వర్గాలకు ఎంతో చేసిందని ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంటూ వ్యాఖ్యానించారు టిఆర్ఎస్ లోకి రావాలని రమణ ను కెసిఆర్ కోరగానే ఎల్ రమణ ఎంతో సానుకూలంగా స్పందించారు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పుకొచ్చారు. దీంతో ఎల్.రమణ టిఆర్ఎస్ లో చేరడం కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఎప్పుడు టిఆర్ఎస్ కండువా కప్పుకోపోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.