జల వివాదం పేరుతో.. మళ్లీ ఈవీఎంలను తెర మీదికి తెచ్చిన టిడిపి?
జల వివాదం విషయంలో తెలంగాణ మంత్రులు అందరూ నీ తండ్రిని నోటికొచ్చినట్లు బూతులు తిడుతుంటే ఎందుకు ఇంకా మూసుకొని కూర్చున్నారు అంటూ ప్రశ్నించారు దేవినేని ఉమా. ఇంత జరుగుతున్నా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని ఎందుకు అడగడం లేదు అంటూ ప్రశ్నించారు. అప్పట్లో కర్నూల్ లో జలదీక్ష చేసి హడావిడి చేసిన జగన్.. ఇప్పుడు ఎందుకు జల హక్కు విషయంలో మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నించారు మీ కేసులు తరుముకొస్తున్నాయి అని భయపడుతున్నారా అంటూ సంచలన విమర్శలు చేశారు. కనీసం ఆక్వా రైతులకు కూడా సరైన సమయంలో నీళ్లు ఇవ్వకుండా సముద్రంలోకి వదలడం ఏంటీ అంటూ ప్రశ్నించారు
అయితే అటు జల వివాదం విషయంలో జగన్ పై సంచలన విమర్శలు చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు అదే సమయంలో మళ్లీ ఈవీఎం ల అంశాన్ని కూడా తెరమీదికి తెచ్చారు. ఏదో ఆరు వేల కోట్ల, ఈవీఎం ల పుణ్యమా అని జగన్ అధికారంలోకి వచ్చారు అంటూ ఈ సందర్భంగా దేవినేని ఉమా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారిపోయింది. గతంలో జగన్ అధికారంలోకి రావడం అత్యధిక మెజారిటీ సాధించిన సమయంలో కూడా టిడిపి నేతలు అందరూ ఇలాంటి తరహా విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి రావడానికి ఈవీఎం లు కారణం అన్నారు. ఇక ఇప్పుడు మరో సారి దేవినేని ఉమ ఈవీఎం వివాదాన్ని మరోసారి తెరమీదకు తెచ్చారు. అయితే జలాల వివాదంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సరే.. మధ్యలో ఎందుకు ఈవీఎంలు తెచ్చారు అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.