తాత స్టేడియం కోసం నడుం బిగించిన సీఎం జగన్?
బద్వేలులో సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి పేరుమీద ఒక స్టేడియం ఉంది. ఇక ఇటీవల ఈ స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్టేడియంలో రంజీ మ్యాచ్ లు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక రానున్న రోజుల్లో డే అండ్ నైట్ మ్యాచ్ లను కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్టేడియం లో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేయాలి అంటూ ఇటీవలే బీసీసీఐ తెలిపింది. దీంతో వేగంగా రాజారెడ్డి స్టేడియంలో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేయడంతోపాటు ఇంకెన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు సీఎం జగన్ సిద్దమయ్యాడు.
ఈ క్రమంలోనే ఇక రాజా రెడ్డి స్టేడియం స్టేడియంలో నాలుగు కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇక మనవడు వైయస్ రాజశేఖర్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఈ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు వైసీపీ శ్రేణులు అందరూ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో 50 లక్షలతో బద్వేలులో తన తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరుతో క్రికెట్ స్టేడియం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ స్టేడియం 2010లో పూర్తయింది. ఈ క్రమంలోనే ఇటీవల సీఎం జగన్ ఇక రాజారెడ్డి స్టేడియంలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో పచ్చిక మైదానం లో వెల్కమ్ జగన్మోహన్రెడ్డి అంటూ అట్టహాసంగా స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు స్టేడియం నిర్వాహకులు.