వైసీపీ ఎమ్మెల్యేకు ఇంత అవ‌మాన‌మా ... ఇంత వ్య‌తిరేక‌త ఉందా ?

VUYYURU SUBHASH
ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు పబ్లిక్ గా నిలదీస్తున్నారు. క‌రోనా కారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు ఏడాది కాలం పాటు ప్రజల్లోకి రాలేదు. ఇప్పుడిప్పుడే పబ్లిక్ లోకి వస్తున్న ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిల‌దీత‌లు తప్పటంలేదు. ప్రభుత్వం చేసిన త‌ప్పులు ఎత్తి చూపుతూ బహిరంగంగానే ఎమ్మెల్యేల‌ ముందు తీవ్ర‌ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. డైరెక్ట్ గా మాటల దాడికి దిగుతున్నారు. కొద్ది రోజుల క్రితం రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంతో తాడికొండ‌ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి రైతులు, ప్రజలు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఇక వారం రోజుల క్రితం బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి చిన అప్ప‌ల‌నాయుడును ఓ గ్రామం అంతా క‌లిసి పబ్లిక్ గా తరిమి కొట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి.

ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా సొంత పార్టీ వాళ్లకి ఇవ్వడంతో ఒక గ్రామ ప్రజలు అంతా క‌లిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారు.  దీంతో ఆయన గ్రామం నుంచి బయటికి వెళ్లే వరకు తరిమారు. చివ‌ర‌కు ఆయన పోలీసుల సహాయంతో అక్కడి నుంచి బయట పడాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు గోదావ‌రి జిల్లా ఎమ్మెల్యే వంతు వ‌చ్చింది. తాను ప‌ది ఎక‌రాలు ధాన్యం పండించి అమ్మినా ఇప్ప‌టి వ‌ర‌కు ధాన్యం డబ్బులు రాలేద‌ని ఓ రైతు ప్ర‌శ్నించాడు. దీంతో త‌ణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర‌రావు రైతుపై ఆగ్ర‌హంతో ఊగిపోయారు.

తాను ధాన్యం అమ్మి మూడు నెల‌లు అవుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్బులు రాలేద‌ని రైతు ప్ర‌శ్నించ‌డంతో కారుమూరి ఆగ్ర‌హంతో ఊగిపోయారు. రైతును కూర్చో అంటూ గ‌ద్దించ‌డంతో పాటు ఏక‌వ‌చ‌నంతో సంబోధించారు. పైగా ఈ తంతు అంతా వైసీపీ ప్రభుత్వం చేప‌ట్టిన‌ రైతు దినోత్సవం స‌భ‌లోనే జ‌రిగింది. ఎమ్మెల్యే తీరుతో అక్క‌డున్న వారంతా విస్తుపోయారు. ఇదేం ప‌ద్ధ‌తి అంటూ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇక వ‌రుస‌గా వైసీపీ ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తుండడంతో ప్రభుత్వంపై ఇది వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నమంటున్నారు.

ఇక నారా లోకేష్ సైతం ఎమ్మెల్యే తీరుపై సోష‌ల్ మీడియాలో మండిప‌డ్డారు. అన్న‌దాత‌లంటే అంత అలుసా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర‌రావు గారూ ! అధికార‌మ‌దంతో విర్ర‌వీగుతూ రైతుల్నే బెదిరిస్తారా ?  ధాన్యం బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: