ఈసారి క్షమించండి.. మళ్ళీ కలుద్దాం : సీఎం జగన్
ఇక ఇటీవలే కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ అక్కడ పలు ప్రారంభోత్సవాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలోనే ఇక తన తాత రాజారెడ్డి స్టేడియం కి నాలుగు కోట్ల నిధులు కేటాయించి ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని తెలిపారు. ఇక ఆ తర్వాత కడప మహావీర్ సర్కిల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. ప్రస్తుత పర్యటనలో కార్పొరేటర్లు అందర్నీ కూడా కలవ లేక పోతున్నామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెబుతున్నారు అంటూ సీఎం జగన్ తెలిపారు.
అయితే ప్రస్తుతం కలవలేకపోయినా నెక్స్ట్ టైం పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం అందరూ కార్పొరేటర్లు తప్పకుండా కలుస్తాను అంటూ సీఎం జగన్ తెలిపారు. కార్పొరేటర్లు అందరిని కలిసే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని డిప్యూటీ సీఎం అంజాద్, మంత్రి సురేష్ కు చెబుతున్నాను అంటూ జగన్ తెలిపారు. నెక్స్ట్ టైం పర్యటనలో కార్పొరేటర్స్ అందరిని కలిసి తప్పకుండా ముచ్చటిస్తాను అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుత పర్యటనలో ఇక కార్పొరేటర్లు అందరినీ కలవలేక పోతున్నందుకు డిప్యూటీ సీఎంను, నన్ను అందరూ క్షమించాలి అంటూ కోరారు సీఎం జగన్.