భారత రాజ్యాంగంలో మనకు అనేక హక్కులను పొందుపరిచారు. కానీ ఇప్పటికి ఎవరికి కూడా ఆ హక్కుల గురించి తెలియదు. ఇందులో భాగమే ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కులను రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా భావించబడతాయి. ఆ హక్కు యొక్క స్వరూపాన్ని మార్చే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. అందుకే ప్రాథమిక హక్కులు అంటే అంతా శక్తివంతమైనవి అని చెప్పవచ్చు. ఈ హక్కులకు ఇతర చట్టాల అన్నింటిపైనా ఆధిక్యత ఉంటుంది. ఏ చట్టం అయినా ఈ హక్కులకు బంగం కలిగినట్లయితే న్యాయ సమీక్ష లో భాగంగా అధికార పరిధిలో అతిక్రమణగా సుప్రీంకోర్టు నిర్ధారించుకొని కొట్టేస్తుంది.
ఇందులో ఉండే మిగతా హక్కులను కూడా పార్లమెంట్ పరిధిలో రద్దు చేయవచ్చు కానీ ప్రాథమిక హక్కులను రద్దు చేయడం పార్లమెంట్ తరం కాదు. హక్కులకు హై కోర్ట్, సుప్రీం కోర్ట్ రక్షణ కల్పిస్తాయి. ఏ పౌరుడైన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి హక్కులను కాపాడుకోవచ్చు. ఉదాహరణకు ఎవరినైనా వ్యక్తులను ఎలాంటి తప్పులు చేయకుండా అక్రమంగా నిర్బందిస్తే, వారి స్నేహితులు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం అడిగితే హెబిఎస్ కార్పస్ అనే ఆదేశం ద్వారా రిట్ జారీ చేస్తోంది.. కొన్ని దేశాల్లో సమాచార హక్కు ప్రాథమికంగా ఉన్నా దేశాల్లో రహస్యంగా దాచిన సమాచారాన్ని కూడా హెబీఎస్ డేటా అనే ఆదేశాలతో న్యాయస్థానాలు వెలికి తీయగలవు. ఇందులో ఇప్పుడు కూడా సమాచార హక్కు అనే మాట వాడారు. కానీ వివరణ ఇవ్వలేదు. ఇతర దేశములలో ఈ యొక్క సమాచార హక్కును సమాచారం పొందే హక్కు, ఇతరులకు చెప్పే హక్కు, పంచుకునే హక్కు గానే వినియోగిస్తారు. మనం కూడా అదే అర్థాలతో ఈ సమాచార హక్కు ను ఉప యోగించుదాం. మనం తీసుకున్న సమాచారం ఏదైనా బీరువాలో పెట్టడానికి కాదు కదా..! అది ఒక పది మందికి చెప్పాల్సిన అవసరం ఉండవచ్చు. బాడీ రుసుము, సమయాన్ని వృధా పరిచి ప్రతి పౌరుడు సమాచారాన్ని పొందలేక పోవచ్చు. ఈ హక్కులో భాగంగా అవినీతి జరి గినట్లయితే వార్త సాధనల ద్వారా ఆ సమాచారాన్ని ప్రజలకు తెలుపవలసి ఉంటుంది. ఇందులోని పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి వస్తోంది. ఇది పత్రికా రచయితలకు, విలేకరులకు అతి కీలకమైన విషయం అని చెప్పవచ్చు.
అమెరికాలో సమాచారం స్వేచ్ఛ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత మొదట్లో అక్కడి పత్రికలకి సమాచారం ఎక్కువగా వస్తున్న సందర్భంగా అక్కడి మీడియా ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగించాలి అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు సమాచారాన్ని రహస్యంగా ఉంచబడినప్పుడే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సమాచారాన్ని సంపాదించి తమ పూర్తి సమాచారాన్ని సమర్థవంతంగా ఉపయోగించగలమని ప్రభుత్వం తనకు తానుగా సమాచారం ఇస్తున్నప్పుడు అంత సమర్థవంతంగా ఉపయోగించి లేక పోతున్నామని కొందరు జర్నలిస్టులు చలోక్తులు విసురుతూ ఉన్నారు.