వామ్మో హుజురాబాద్ లో ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయా..?
హుజురాబాద్ ప్రజలను టిఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురిచేస్తూ, టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తీసి వేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇతర ప్రాంతాల ఓటర్లను కూడా ఇక్కడ చేరుస్తున్నారని, దొంగ ఓట్లు కూడా సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ఒక ఇంట్లోనే 30 నుంచి 40 దొంగ ఓట్లు సృష్టించి ఓటర్ లిస్ట్ లో నమోదు చేస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తూన్న అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. హుజురాబాద్, జమ్మికుంటలోని ప్రజలంతా దొంగ ఓట్లపై దృష్టి పెట్టి, ఎవరి ఓటును వారే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరు కూడా అధికార పార్టీకి బానిసలుగా పనిచేయవద్దని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని అధికార పార్టీ దుర్వినియోగం పెరిగిపోయింది అన్నారు. హరీష్ రావు కుల సంఘాలతో రంగనాయక సాగర్ లో బేరాలు జరుపుతున్నారని తెలిపారు.
ఈ దొంగ ఓట్ల ప్రక్రియ కూడా ఆర్డివో నేతృత్వంలో జరుగుతుందని, దీంట్లో భాగంగా అధికార పార్టీకి వ్యతిరేక ఓట్లు తీసేస్తూ 30 నుంచి 40 దొంగ ఓట్లను పెద్ద ఊర్లలో నమోదు చేస్తున్నారన్నారు. అలాగే హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ అయిన రాధిక ఇంట్లో ముప్పై నాలుగు ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలు కూడా చూపించారు.మీ ఓట్లను తొలగించుకోకుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంద న్నారు. అధికారులంతా బాధ్యతలు మరిచి బానిసలుగా చేయవద్దని, ఉద్యమ ద్రోహులు అంతా టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని కడిగిపారేశారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్క రుగా బయటకు వెళ్తున్నారని అన్నారు. ఒక్క ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా టిఆర్ఎస్ ఓటు వేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. తను ఒంటరిగా బరిలోకి దిగానని, ప్రజా స్వామిక వాదులు అండదండలతో పోటీ చేస్తున్నా అన్నారు. ఎన్నికలు కేసీఆర్ కు ఈటల మధ్య న్యాయానికి, అన్యా యానికి మధ్య జరుగుతుందని దీనిపై ప్రజలు తుది తీర్పు ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.