మొన్న అన్న ఇవాళ తమ్ముడు...సొంత పార్టీనే ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారుగా ?

Veldandi Saikiran
తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటి రెడ్డి బ్రదర్స్‌ అంటే ఎంతో పేరుంది. నల్గొండ జిల్లాను కొన్ని ఏళ్లుగా కోమటి రెడ్డి బ్రదర్స్‌ ఏలుతున్నారు. అయితే... తాజాగా రేవంత్‌ రెడ్డి పీసీసీ పదవీ ఇవ్వడంతో... గుర్రు అయ్యారు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి. అంతేకాదు.. కాంగ్రెస్‌ పార్టీపై కూడా మండిపడ్డారు. ఆ తర్వాత అధిష్టానం మందలించడంతో కాస్త సైలెంట్‌ అయ్యారు. అయితే..  తాజాగా... నారాయణపురం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... సంచలన వ్యాఖ్యలు చేశారు.  

కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాల తీసుకోవడం మూలంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడిపోవడానికి కారణమని పేర్కొన్న ఆయన...  సరైన నాయకత్వం లేకపోవడం మరో కారణమన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఏ తప్ప చేయలేదని... తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు తలెత్తుకునేలా చేశారని తెలిపారు. కొంతమంది స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఇచ్చే విషయంలో గాని.. పోరాటం చేసే విషయంలో  సరైన పద్ధతి లో పని చేయకపోవడం తెలంగాణ కాంగ్రెస్ బలహీనపడేలా చేశారని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో, ప్రజా సమస్యల పోరాటంలో  స్పందించకపోవడంతో తాను ఘాటుగా స్పందించానని చెప్పిన..కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి...  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి  భవిష్యత్ లేదు అని మాట్లాడిన మాట వాస్తవమే అని స్పష్టం చేశారు.   రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేయడంతో కార్యకర్తలల్లో నిరుత్సాహం కలిగిందని అభిప్రాయపడ్డారు.   రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు నియమించిందని... చెప్పిన ఆయన... ఇప్పుడు విమర్శించదలచుకోలేదన్నారు.  ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడదలుచు కోలేదన్నారు. తాను ఏ పార్టీలో చేరబోనని... ఎప్పటికి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు కోమటి రెడ్డి రాజ గోపాల్‌. పార్టీ అభివృద్ధి కి నిరంతరం కష్ట పడతామని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: