తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు .అన్ని జిల్లాలలో పర్యటిస్తూ కార్యకర్తలను కలుపుకుపోతున్నారు. రేవంత్ రాకతో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నేతల్లో కూడా కొత్త జోష్ కనిపిస్తోంది. అన్ని జిల్లాలలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా లు కూడా చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ తన స్టామినాను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈరోజు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పిక్ పాకిటర్ లో హల్చల్ చేశారు. పలువురి జేబులను దొంగలించేందుకు పిక్ పాకెటర్స్ ప్రయత్నించారు.
దాంతో వారిని అక్కడే ఉన్న కార్యకర్తలు గుర్తించి పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పజెప్పారు. అయితే రాజకీయ నాయకుల ర్యాలీలలో, సభల్లో పిక్ పాకెటర్లు హల్చల్ చేయడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా అయితే పిక్ పాకెటర్ లు బస్సులలో రైళ్లలో లేదంటే ఉత్సవాల్లో కనిపిస్తుంటారు. అక్కడైతే ప్రజలు బిజీగా ఉంటే తమ పని తాము చేసుకుని వెళ్ళవచ్చని భావిస్తుంటారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల మీటింగ్ లలో సైతం జేబుదొంగలు చేతివాటం చూపించడం ఆందోళన కలిగిస్తోంది.
మొన్న వైయస్ షర్మిల తన పార్టీ ఆవిర్భావం సందర్భంగా భారీ సభను నిర్వహించారు. అయితే ఈ సభకు వచ్చిన ఓ మహిళ నాయకురాలి ఫోన్ దొంగలు కొట్టేశారు. దాంతో తన ఫోన్ లో చాలా ముఖ్యమైన సమాచారం ఉందని ఫోన్ పోయిందని ఆమె స్టేజ్ పైనే చెప్పారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన సభ నిర్వహించారు. అయితే ఈ సభల్లోనూ పిక్ పాకెటర్లు తమ టాలెంట్ ను ప్రదర్శించారు. పలువురు నాయకుల ఫోన్ లను కొట్టేశారు. అంతేకాకుండా ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన ఓ సభలో పర్సులను కొట్టేసారు ఈ వార్త కూడా తెగ వైరల్ అయింది.