అలా చేయడం ప్రమాదమే.. వ్యాక్సిన్ ఫై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు?
ఇక ఇప్పటి వరకు వ్యాప్తి చెందిన మొదటి దశ, రెండవ దశ వైరస్ల పై ప్రస్తుతం అత్యవసర వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లు ఎంతో సమర్థవంతంగా పనిచేసాయ్. ప్రతి ఒక్కరిలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కానీ కొత్తగా వెలుగులోకి వస్తున్న వేరియంట్లను ప్రస్తుతం అత్యవసర వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లు ఎంతవరకు అడ్డుకోగలవు అన్న దానిపై మాత్రం ఇప్పటికీ శాస్త్రవేత్తల దగ్గర పూర్తిస్థాయి సమాచారం లేదు. ఇలాంటి సమయంలోనే రెండు రకాల వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మరింత అభివృద్ధి చెందుతుందని ఇక కొత్త వేరియంట్లను కూడా అడ్డుకోవచ్చని కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే తాజాగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ లోనే కీలక పరిశోధకురాలు సౌమ్య స్వామినాథన్ స్పందిస్తూ ఆసక్తికర విషయాలను చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ను కలపడం లేదా సరిపోల్చడం ప్రమాదకరమైన ధోరణి అంటూ ఆమె వ్యాఖ్యానించారు ఇప్పటివరకు ఇలా కరోనా వ్యాక్సిన్ ను కలపడం కానీ సరి పోల్చడానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం తమ వద్ద లేదని ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటివి ప్రయత్నించడం మాత్రం ప్రమాదకరం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు కేవలం ఒకే రకానికి చెందిన వ్యాక్సిన్లను రెండు డోసులు తీసుకోవడమే మంచిది అన్న సమాచారం మాత్రమే ఉందని.. అందుకే మిక్స్డ్ వ్యాక్సినేషన్ కొనసాగించడం ప్రమాదకరం అంటూ ఆమె చెప్పుకొచ్చారు.