రాజకీయాలన్నీ ఇంకా ఆ దివంగత నేత చుట్టే తిరుగుతున్నాయి..?
ఒకే అంశంపై విరుద్ధ రాజకీయానికి కారణం ఏమిటంటే జలం తీసుకొచ్చిన జగడమే అని చెప్పవచ్చు. ఈ రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం ఎప్పుడు వచ్చినా ముందుగా వినిపించే పేరు వైయస్ రాజశేఖర్ రెడ్డి. నిజానికి తన హయాంలో ఇప్పుడున్న తెలంగాణలో, ఏపీలో కూడా అనేక ప్రాజెక్టులను మొదలుపెట్టాడు. జలయజ్ఞం పేరుతో చాలా ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు ఆయన. అయితే 2009వ సంవత్సరంలో రెండోసారి సీఎం అయిన తర్వాత ఆకస్మికంగా ఆయన చనిపోవడం దీంతో ప్రాజెక్టు పనులన్నీ నెమ్మదిగా ఆగిపోయాయి. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం ఉండి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తయి ఉండేవీ. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన టువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇప్పుడు జగన్ చేస్తున్నది ఏమిటంటే ఆ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం. దీనికి తెలంగాణ నుంచి మంత్రులు అభ్యంతరం చెబుతున్నారంటే తెలంగాణలో నిర్మించిన నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రాజెక్టులు కూడా అనుమతులు లేవు. మొత్తానికి ప్రస్తుత రాజకీయమంతా వైయస్ చుట్టే తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు.